Kajal: ‘సత్యభామ’ చేసినందుకు గర్వంగా ఉంది: కాజల్ అగర్వాల్‌

కాజల్ అగర్వాల్‌ తాజా చిత్రం ‘సత్యభామ’. జూన్‌ 7న ప్రేక్షకుల ముందుకురానుంది.

Published : 30 May 2024 18:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాజల్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘సత్యభామ’ (Sathyabhama Movie). సుమన్‌ చిక్కాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం జాన్‌ 7న ప్రేక్షకుల ముందుకురానుంది. తాజాగా ఈ చిత్రబృందం ప్రెస్‌మీట్‌లో సినిమా విశేషాలు పంచుకుంది. 

ఇందులో మీరు ‘కర్తవ్యం’లో విజయశాంతిలా ఉంటారా?

కాజల్‌: ఆమెతో పోల్చడమే నాకు గౌరవంగా ఉంది. నేను ఇప్పటివరకు ఇలాంటి పాత్రలు చేయలేదు. ఈ పాత్రను సవాలుతో స్వీకరించాను.

‘సత్యభామ’ (Satyabhama) చేయడానికి కారణమేంటి?

కాజల్‌: స్టోరీ చాలా నచ్చింది. కథ వినగానే కొత్తగా అనిపించింది. అందుకే వెంటనే ఓకే చేశాను. ఇలాంటి సినిమా చేసినందుకు గర్వంగా ఉంది.

ఈ సినిమా కోసం ఏమైనా శిక్షణ తీసుకున్నారా?

కాజల్‌: ఇది ఓ బాధ్యతగా తీసుకున్నా. చాలా ప్రిపేర్‌ అయ్యాను. స్టంట్స్‌ నేర్చుకున్నా. 

తల్లి అయ్యాక చేసిన మొదటి సినిమా కదా.. ఎలా అనిపించింది?

కాజల్‌: ఛాలెంజింగ్‌గా అనిపించింది. నటన అంటే నాకు ఇష్టం. దానికి ప్రాధ్యాన్యమిస్తాను. అందుకే కష్టపడ్డాను. ఇలాంటి సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నా. కష్టపడితే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదని నేను నమ్ముతాను.

ఈ కథకు కాజల్‌ను ఎంచుకోవడానికి కారణం?

సుమన్‌ చిక్కాల: ఈ కథకు కాజల్ మాత్రమే న్యాయం చేయగలరనిపించింది. ఇందులో యాక్షన్‌తో పాటు ఎమోషన్‌ కూడా ఉంటుంది.

ఈ సినిమా తర్వాత ప్రేమకథా చిత్రాల్లో అవకాశం వస్తే చేస్తారా?

కాజల్‌: చేస్తాను. ఎప్పుడూ ఒకేతరహా చిత్రాల్లో నటించాలని రూల్స్‌ ఏం లేవు కదా.

పెళ్లి తర్వాత కథల ఎంపికలో హద్దులు పెట్టుకున్నారా?

కాజల్‌: ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు. సినిమా అంటే నాకు ఇష్టం. పెళ్లి తర్వాత ఏ విషయంలోనూ మార్పు రాలేదు. 

ఇప్పటివరకు తారక్‌, పవన్‌ కల్యాణ్‌, రామ్‌చరణ్‌ పోలీస్‌లుగా నటించారు. వీళ్లలో ఎవరిని స్ఫూర్తిగా తీసుకున్నారు?

కాజల్‌: ఒకరిని ఎంచుకోవడం కష్టం. వాళ్లందరూ పోలీసులుగా అద్భుతంగా నటించారు. నేను ఈ పాత్ర చేశాకే ఇలాంటివి చేయడం ఎంత కష్టమో అర్థమైంది.

ఈ సినిమా చేసేటప్పుడు గాయలు అయ్యాయా?

కాజల్‌: లేదు. యాక్షన్‌ కొరియోగ్రాఫర్లు చాలా జాగ్రత్తగా నేర్పించారు.

మొదటి సినిమానే క్రైమ్‌ థ్రిల్లర్ చేయడానికి కారణం? 

సుమన్‌ చిక్కాల: కావాలనేం చేయలేదు. అలా కుదిరిందంతే. 

ఈ సినిమా కోసం రీసెర్చ్‌ చేశారా?

కాజల్‌: మా టీమ్ అంతా ఎంతో రీసెర్చ్‌ చేసింది. చాలా హోంవర్క్‌ చేశాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని