Dhaakad: ఒళ్లు జలదరించే పోరాటాలు
యాక్షన్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం ‘ధాకడ్’. రజనీష్ ఘయ్ దర్శకుడు. మే 20న విడుదల కానున్న ఈ చిత్ర రెండో ట్రైలర్ తాజాగా విడుదలైంది. మొదటి ట్రైలర్లో కంటే ఇందులో యాక్షన్ రెట్టింపైంది.
యాక్షన్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం ‘ధాకడ్’. రజనీష్ ఘయ్ దర్శకుడు. మే 20న విడుదల కానున్న ఈ చిత్ర రెండో ట్రైలర్ తాజాగా విడుదలైంది. మొదటి ట్రైలర్లో కంటే ఇందులో యాక్షన్ రెట్టింపైంది. ‘‘ఏజెంట్ అగ్ని పాత్రలో కంగనా పూర్తిగా ఒదిగి పోయింది. కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఒళ్లు జలదరించేలా ఉన్నాయి. మానవ అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో ఏజెంట్ అగ్ని క్రూరుడైన ప్రతినాయక పాత్ర రుద్రవీర్ను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఉత్కంఠభరితమైన పోరాటాలతో పూర్తి శక్తిమంతమైన యాక్షన్ థ్రిల్లర్గా ‘ధాకడ్’ ఉండనుంది’’ అని చిత్రబృందం తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.