Venkatesh: ప్రేమ కథ వైపు వెంకీ చూపు!

ఒకప్పుడు ప్రేమకథలకి పెట్టింది పేరు వెంకటేశ్‌. యువతరాన్ని... కుటుంబ ప్రేక్షకుల్ని కలిపి మెప్పించే ప్రేమకథల్లో విరివిగా నటించారు.

Updated : 22 Oct 2023 13:45 IST

కప్పుడు ప్రేమకథలకి పెట్టింది పేరు వెంకటేశ్‌. యువతరాన్ని... కుటుంబ ప్రేక్షకుల్ని కలిపి మెప్పించే ప్రేమకథల్లో విరివిగా నటించారు. క్రమంగా తన వయసుకు తగ్గ కథల్ని ఎంచుకుంటూ ప్రయాణం చేశారు. అయితే స్వతహాగా ప్రేమకథల్లో నటించడమంటే ఇష్టం అని చెబుతుంటారు వెంకటేశ్‌. ఇప్పుడు కూడా ఆయన ప్రేమకథ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇదివరకటి కథల్లా కాకుండా... పరిణతితో కూడిన ఓ మంచి ప్రేమకథలో నటించాలనేది ఆయన ఆలోచన. ఇటీవల ‘సైంధవ్‌’ వేడుకలోనూ అదే విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన కోసం ఓ ప్రేమకథ సిద్ధమవుతున్నట్టు సమాచారం. వెంకటేశ్‌ కోసం సురేష్‌ ప్రొడక్షన్స్‌లో పలు స్క్రిప్ట్‌లు సిద్ధం అవుతుంటాయి. అందులో ఓ ప్రేమకథ కూడా ఉంది. ఓ యువ దర్శకుడు ఆ కథని సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అన్నీ కుదిరితే తదుపరి అదే కథతోనే వెంకీ రంగంలోకి దిగే అవకాశాలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని