Manchu Lakshmi: రేవ్‌ పార్టీపై స్పందించిన మంచు లక్ష్మి.. ఏమన్నారంటే

చాలా రోజుల తర్వాత ‘యక్షిణి’ వెబ్‌ సిరీస్‌తో అలరించడానికి సిద్ధమయ్యారు నటి మంచు లక్ష్మి. తాజాగా దీని ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ జరిగింది.

Published : 25 May 2024 10:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మంచు లక్ష్మి, అజయ్‌, వేదిక, ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్‌సిరీస్‌ ‘యక్షిణి’ (Yakshini). తేజ మార్ని దర్శకత్వం వహించారు. జూన్‌ 14 నుంచి ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’ (Disney+ Hotstar)లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. అందులో మంచు లక్ష్మి (Manchu Lakshmi) పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

బాలీవుడ్‌కు వెళ్లలేదు..

నేను బాలీవుడ్‌కు వెళ్లానని కొందరు భావిస్తున్నారు. ముంబయి షిఫ్ట్‌ అయ్యానంతే. నాకు ఏ భాష అయినా ఒకటే. హాలీవుడ్‌ నుంచి వచ్చాను. ఇప్పుడు టాలీవుడ్‌లో చేస్తున్నాను. కోలీవుడ్‌లో చేశాను. నటీనటులకు భాషతో సంబంధం ఉండదు. హైదరాబాద్ నా ఇల్లుతో సమానం. నా కుటుంబమంతా ఇక్కడే ఉంటుంది. నా కెరీర్‌ కోసం, నా కుమార్తె భవిష్యత్తు కోసం ముంబయి వెళ్లానంతే. దిల్లీ వెళ్లాలనుకున్నా కానీ ముంబయి అయితే కెరీర్‌కు కూడా బాగుంటుందని షిఫ్ట్‌ అయ్యాను. 

‘కన్నప్ప’లో లేను..

మంచు విష్ణు ‘కన్నప్ప’లో నేను ఎందుకు నటించడం లేదని చాలా మంది అడుగుతున్నారు. బహుశా నాకు సరిపోయే పాత్ర లేదేమో. అందుకే అవకాశం ఇవ్వలేదు. మనోజ్‌ కూడా లేడు. ఒకవేళ నేను, మనోజ్‌ కూడా ఉంటే అది మా ఫ్యామిలీ సినిమా అవుతుంది.

నాకు తెలియదు..

రేవ్‌ పార్టీలో ఏం జరిగిందో తెలియదు. ఈ ప్రశ్న అడగడానికి ఇది సందర్భం కాదు. చాలా రోజుల తర్వాత నేను నటించిన వెబ్‌ సిరీస్‌ మీ ముందుకు రానుంది. దాని గురించి మాట్లాడదాం. ఎవరో ఎక్కడికో వెళ్తే నాకేంటి సంబంధం. ఆ వ్యక్తులు.. వాళ్ల ప్రాబ్లమ్‌ అంతే.

ట్రోల్స్‌ చూసి బాధపడేదాన్ని..

నేను ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని. మీ బిడ్డని. నాది మొదటి నుంచి ముక్కుసూటిగా మాట్లాడేతత్వం. కొందరు నన్ను ట్రోల్స్‌ చేయడం చూసి బాధేసేది. పొలిటికల్‌గా మాట్లాడడం మాకు రాదు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాం. అది కొందరికి నచ్చుతుంది. మరికొందరికి నచ్చదు. నచ్చినవాళ్లు అభిమానిస్తారు. ఎవరో కావాలని నన్ను ట్రోల్‌ చేస్తారని భావించను. ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్‌ ఉన్నారు. రానా, చరణ్‌, తారక్‌.. మేమంతా కలిసి పెరిగాం. మేమంతా కలిసే ఉన్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు