Keeravani: కొత్త దర్శకుల చిత్రాలకు మ్యూజిక్ అందించడానికి కారణమదే: కీరవాణి

సంగీత దర్శకుడు కీరవాణి (Keeravani) తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘నా సామి రంగ’ విశేషాలు పంచుకున్నారు.

Updated : 09 Jan 2024 07:02 IST

తన సంగీతంతో సినీప్రియులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తారు మ్యూజిక్‌ డైరెక్టర్‌ కీరవాణి (Keeravani). ఆయన సంగీతం అందించిన తాజా చిత్రం ‘నా సామిరంగ’ (Naa Saami Ranga). నాగార్జున (Nagarjuna) హీరోగా తెరకెక్కిన చిత్రమిది. విజయ్‌ బిన్నీ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం విశేషాలను కీరవాణి పంచుకున్నారిలా..!

‘నా సామిరంగ’కు వర్క్‌ చేయడానికి ప్రత్యేక కారణమేమైనా ఉందా?

కీరవాణి: సెలక్టివ్‌ సినిమాలకు మాత్రమే నేను సంగీతం అందిస్తాను. ఏ చిత్రానికైనా గుర్తింపు పాటల వల్లే వస్తుంది. నాగార్జున సినిమాలకు మ్యూజిక్ అందించడం నాకు అలవాటైన విద్య. మాది హిట్ కాంబినేషన్‌. కొత్తగా వచ్చే దర్శకులు ఎక్కువ శ్రమతో సినిమా తీస్తారు. ‘నా సామిరంగ’ చేయడానికి విజయ్‌ బిన్నీ కూడా ఒక కారణం. ఆ రోజుల్లో ‘ప్రెసిడెంటు గారి పెళ్ళాం’ ఎంతటి ఆదరణ పొందిందో ఇదీ అలానే ఆకట్టుకుంటుంది.

నా సామిరంగ మాతృక చూశారా?

కీరవాణి:చూశాను. గతంలో నేను సంగీతం అందించిన ‘సుందరకాండ’ కూడా రీమేక్‌ చిత్రమే. కానీ, దానికి మాతృకతో ఎలాంటి సంబంధం ఉండదు. ఇదీ అంతే. ఇక్కడి ప్రేక్షకులకు తగినట్లు మార్పులు చేశారు. రీమేక్‌ చేయడం చాలా కష్టం.

ఇందులో పాట రాశారట నిజమేనా?

కీరవాణి: నేను రచయితను కాదు. సందర్భం వచ్చినప్పుడు ఐడియా ఏమైనా వస్తే రాస్తాను. అలానే ఇందులో కూడా ఒక పాట రాశా. ఈ సినిమా మూడు నెలల్లో పూర్తయ్యింది. ఇప్పటి తరాన్ని ఆకర్షించే సంగీతాన్ని అందించా. 

విజయ్‌ బిన్నీలో మీకు నచ్చిన అంశం?

కీరవాణి: చురుగ్గా ఉంటాడు. నిర్ణయాలను త్వరగా తీసుకుంటాడు. అందుకే ఈ చిత్రం షూటింగ్‌ కూడా శరవేగంగా జరిగేలా చూశాడు. సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడలేదు.

Dil Raju: నాపై తప్పుడు వార్తలు రాస్తే తాటతీస్తా: సినీ నిర్మాత దిల్‌ రాజు

ఇటీవల మణిశర్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అవకాశాలు రావట్లేదన్నారు. దీనిపై మీ అభిప్రాయం?

కీరవాణి: మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ ఒక్కోసారి హీరోలను దృష్టిలో పెట్టుకుని ట్యూన్స్‌ కంపోజ్‌ చేస్తారు. ఆ హీరో కొత్త సినిమా తీసే వరకు ఆ ట్యూన్‌ను ఉపయోగించడం కోసం ఎదురుచూస్తుంటారు. ఆయన చెప్పింది అలా అనుకోవచ్చు. మీరు ఈ ప్రశ్నకు సమాధానం ఆయన్నే అడగండి.

ఈ సినిమాలో ఐటెం సాంగ్‌ ఉందా?

కీరవాణి: త్వరలోనే మిగిలిన పాటలు విడుదలవుతాయి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. నా దృష్టిలో ఐటెంసాంగ్స్ అని ప్రత్యేకంగా ఏమీ ఉండవు. ప్రేక్షకులకు హుషారు కలిగించే గీతాలుంటాయి అంతే.

మీరు రిటైర్‌ అవుతున్నట్లు గతంలో ఒకసారి ప్రకటించారు. మళ్లీ అలాంటి షాక్‌లు ఇస్తారా?

కీరవాణి: నా కెరీర్‌లోనూ ఒడిదొడుకులు ఉన్నాయి. నేను ప్రతి స్థాయిని ఎంజాయ్ చేశాను.  

నాగార్జునతో మీరు చాలా సినిమాలకు పనిచేశారు. వాటికి ఆస్కార్‌ వస్తే బాగుండేదని అనిపించిందా?

కీరవాణి: ఎప్పుడూ అనిపించలేదు. నాకు అవార్డులంటే ఇష్టం లేదు. ‘మీరు ఆస్కార్ తీసుకురండీ’ అని రామోజీరావుగారు అన్నారు. ఆయన ఆ మాట అన్న తర్వాత దాని గురించి తెలుసుకుని కృషి చేశా.

‘హరిహరవీరమల్లు’ అప్‌డేట్‌ ఏమైనా చెబుతారా?

కీరవాణి: ఆ సినిమాలో మూడు పాటలు పూర్తయ్యాయి.

చిరంజీవి గారి సినిమా షూటింగ్‌ ఎంత వరకు వచ్చింది?

కీరవాణి: ప్రస్తుతం కొన్ని సన్నివేశాల షూటింగ్‌ జరుగుతోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు