Nawazuddin Siddiqui: ‘సైంధవ్‌’.. అదృష్టవశాత్తూ బోటులోనే ల్యాండ్‌ అయ్యా: నవాజుద్దీన్‌

‘సైంధవ్‌’ (Saindhav)తో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ (Nawazuddin Siddiqui). వెంకటేశ్‌ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆయన ప్రతినాయకుడి పాత్ర పోషించారు.

Updated : 06 Jan 2024 20:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వెంకటేశ్‌ (Venkatesh) హీరోగా శైలేశ్‌ కొలను దర్శకత్వం వహించిన చిత్రం ‘సైంధవ్‌’ (Saindhav). నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కానున్నారు బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో సిద్ధమైన ‘సైంధవ్‌’ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నవాజుద్దీన్‌ తాజాగా విలేకర్లతో ముచ్చటించారు. ఆ విశేషాలివే.. 

తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడానికి ఎందుకింత సమయం తీసుకున్నారు?

నవాజుద్దీన్‌ సిద్ధిఖీ: మంచి కథతో తెలుగు ప్రేక్షకులను పలకరించాలని ఎదురుచూశా. ‘సైంధవ్‌’తో ఆ అవకాశం వచ్చింది. ఇది ఎంతో ఆసక్తికరమైన కథ. వెంకటేశ్‌తో కలిసి వర్క్‌ చేయడం ఆనందంగా అనిపించింది. దాదాపు 40 రోజులు పనిచేశా. నా పాత్ర ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్ముతున్నా.

‘సైంధవ్‌’లో ప్రతినాయకుడిగా కనిపించడానికి కారణం?

నవాజుద్దీన్‌ సిద్ధిఖీ: హీరో లేదా విలన్‌.. పాత్ర ఏదైనా సరే ఆసక్తికరంగా ఉందా లేదా అనేది ముఖ్యం. నెగెటివ్‌ రోల్స్‌లో నటనకు ఆస్కారం ఉంటుందని నా భావన. శైలేశ్‌ విభిన్నమైన పాత్ర క్రియేట్‌ చేశారు.

డబ్బింగ్‌ చెప్పేటప్పుడు ఏమైనా సవాళ్లు ఎదుర్కొన్నారా?

నవాజుద్దీన్‌ సిద్ధిఖీ: ఇందులో నాది హైదరాబాదీ పాత్ర. భాష, భావాన్ని అర్థం చేసుకుని డబ్బింగ్‌ చెప్పా. కొత్త భాష నేర్చుకునేటప్పుడు కొంత కష్టంగానే ఉంటుంది. ప్రామ్టింగ్ మీద నాకు నమ్మకం లేదు. కష్టమైనా సరే డైలాగ్‌లను నేర్చుకుని చెప్పడమే ఇష్టం. యాక్షన్‌ సీన్స్‌లో నటించడం సవాలుగా అనిపించింది.

Vijay Sethupathi: ఆ లేబుల్‌ నాకు అవసరం లేదు: విజయ్‌ సేతుపతి

వెంకటేశ్‌ నుంచి మీరు ఎలాంటి విషయాలు నేర్చుకున్నారు?

నవాజుద్దీన్‌ సిద్ధిఖీ: వెంకటేశ్‌ చాలా కూల్‌గా ఉంటారు. సెట్‌లోకి వచ్చే ముందే డైలాగ్స్‌ అన్నీ నేర్చుకుని వస్తారు. డూప్‌ లేకుండా యాక్షన్‌ సీన్స్‌లో యాక్ట్‌ చేస్తారు. ఆయనకు సహనం ఎక్కువ.

దర్శకుడు శైలేశ్‌పై మీ అభిప్రాయం?

నవాజుద్దీన్‌ సిద్ధిఖీ: వర్క్‌ విషయంలో ఆయనకు ఫుల్‌ క్లారిటీ ఉంటుంది. కథ చెప్పినప్పుడే ఇది తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకం కలిగింది. ఎంత అద్భుతంగా కథ చెప్పాడో అదే విధంగా తెరకెక్కించాడు. సినిమాకు సంబంధించిన అన్ని విషయాలపై అతడికి పట్టు ఉంది.

‘సైంధవ్‌’ చిత్రీకరణలో మీకు ఎప్పటికీ గుర్తుండిపోయే విషయం?

నవాజుద్దీన్‌ సిద్ధిఖీ: శ్రీలంక షెడ్యూల్‌. సముద్రంలో బోటుపై యాక్షన్ సీక్వెన్స్‌ చిత్రీకరిస్తున్నప్పుడు.. ఒక పెద్ద అల వచ్చింది. బోటు వదిలేసి అలతో పాటు పైకి లేచా. అదృష్టవశాత్తూ మళ్లీ బోటులోనే ల్యాండ్‌ అయ్యా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని