నా వల్ల కాదేమోనని ఏడ్చేసేదాన్ని: పరిణీతి చోప్రా

సాధారణంగా బయోపిక్‌లలో నటించడం అంటే అషామాషీ వ్యవహారం కాదు. అందులోనూ అవి క్రీడాకారుల జీవితాలైతే మానసికంగా, శారీరికంగా ఎంతో కష్టించాలి. తాజాగా నటి పరిణితి చోప్రా భారతీయ బాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనానెహ్వాల్‌ బయోపిక్‌లో నటిస్తున్న

Published : 18 Mar 2021 01:18 IST

ముంబయి: సాధారణంగా బయోపిక్‌లలో నటించడం ఆషామాషీ వ్యవహారం కాదు. అందులోనూ అవి క్రీడాకారుల జీవితాలైతే.. మానసికంగా, శారీరకంగా ఎంతో కష్టపడాలి. తాజాగా నటి పరిణీతి చోప్రా భారతీయ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనానెహ్వాల్‌ బయోపిక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒక క్రీడాకారిణిలా కనిపించాలంటే శారీరక దృఢత్వం ఎంతో అవసరం. అందుకు తగ్గట్టు పూర్తిస్థాయిలో కసరత్తులు చేయాలి. ఆ ప్రయాణంపై పరిణితి స్పందించారు.

‘రోజూ తెల్లవారుజామున రన్నింగ్‌తో నా ఫిట్‌నెస్‌ ప్రక్రియ మొదలయ్యేది. అలాగే ఒక క్రీడాకారిణిగా భావోద్వేగాలు ఎలా ఉండాలో సాధన చేసేదాన్ని. కొన్ని సార్లు బ్యాడ్మింటన్‌ కోర్టులోనే ఏడ్చేసేదాన్ని, ఈ చిత్రంలో నటించటం నా వల్ల కాదేమో అని కూడా బాధపడుతుండేదాన్ని. అంతిమంగా ఒకటే అనుకున్నా సైనాలా నటించటమే కాదు, సైనాలానే ఉండాలని. అదేంటో తెరపై మీరే చూస్తారు’అంటూ  వివరించారు. ఆ వీడియోలో ఆమెతో పాటు ట్రైనర్స్‌ కూడా ఈ ప్రయాణంలో తమ అనుభవాలను పంచుకున్నారు. ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా విడుదలైన ‘సైనా’టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆమోల్‌ గుప్టే దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం మార్చి 26న ప్రేక్షకులను థియేటర్‌ కోర్టులో పలకరించనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని