coolie: రజనీకాంత్ చిత్రం... కూలీ
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రానికి ‘కూలీ’ అనే పేరుని ఖరారు చేశారు. ఇది రజనీ 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రానికి ‘కూలీ’ అనే పేరుని ఖరారు చేశారు. ఇది రజనీ 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. భారీ అంచనాలున్న ఈ సినిమాపై సినీ ప్రేమికులు ప్రత్యేకమైన ఆసక్తిని కనబరుస్తున్నారు. సోమవారం చిత్రబృందం ఓ వీడియో చిత్రం ద్వారా సినిమా పేరుని ప్రకటించడంతోపాటు, కథా నేపథ్యాన్నీ పరిచయం చేశారు. అక్రమ రవాణా మాఫియా నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం రూపొందుతున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు ఇందులో నటిస్తున్న తారల గురించీ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఇదొక మల్టీస్టారర్ సినిమా తరహాలో తెరకెక్కబోతోందని, ఇందులో తెలుగు కథానాయకుడు నాగార్జున ఓ కీలక పాత్రని పోషిస్తున్నారని తమిళ సినీవర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఇటీవలే లోకేశ్ కనగరాజ్ హైదరాబాద్‌కి వచ్చి నాగార్జునతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే ఇందులో రజనీకాంత్‌కి కూతురు పాత్ర కోసం శ్రుతిహాసన్ ఎంపికైనట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాలపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. నాగార్జున ఇప్పటికే ధనుష్‌తో కలిసి, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ చిత్రంలో నటిస్తున్నారు.
రకుల్ తండ్రిగా అనిల్ కపూర్?
దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ తనదైన నటనతో అభిమానుల్ని మెప్పిస్తుంది రకుల్ ప్రీత్‌సింగ్. ఇటీవలే తన ప్రియుడు జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసి కొత్త జీవితాన్ని ప్రారంభించిందామె. త్వరలో ‘దే దే ప్యార్ దే 2’తో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఆమె, అజయ్ దేవగణ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అన్షుల్ శర్మ తెరకెకికస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
డీప్‌ఫేక్‌పై ఫిర్యాదు చేసిన రణ్వీర్
చిత్రపరిశ్రమలో రష్మిక మొదలుకొని ఎంతో మంది నటీనటులు డీప్‌ఫేక్ బారిన పడి సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ డీప్‌ఫేక్ వలలో చిక్కిన బాలీవుడ్ కథానాయకుడు రణ్వీర్ సింగ్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇటీవలే రణ్వీర్ వారణాసిలో ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలోని వీడియోను కృత్రిమ మేధస్సు సహాయంతో ఓ రాజకీయ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నట్లు సృష్టించారు. దీనిపై స్పందించిన ఆయన.. డీప్‌ఫేక్ వీడియోను ప్రచారం చేస్తున్న ఖాతాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని, ఎన్నికల సమయంలో పలు రాజకీయ పార్టీలకు నటీనటులు ప్రచారం చేస్తున్నట్లు రూపొందిస్తున్న ఈ డీప్‌ఫేక్ వీడియోలపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
‘బ్యూటీ’ ప్రారంభం
రావు రమేశ్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న చిత్రం ‘బ్యూటీ’. అంకిత్ కొయ్య, విశాఖ ధిమన్ నాయకానాయికలు. బాల సుబ్రహ్మణ్యమ్ దర్శకత్వం వహిస్తున్నారు. మారుతి టీమ్ ప్రొడక్ట్, వానరా సెల్యూలాయిడ్ సంస్థలపై ఎ.విజయపాల్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్‌లో జరిగాయి. దర్శకుడు మారుతి క్లాప్‌నివ్వగా, మరో దర్శకుడు బుచ్చిబాబు సానా కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకులు వీరశంకర్, సుబ్బు మంగాదేవి, డార్లింగ్ స్వామి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
సోమవారం దిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ భూషణ్ పురస్కారాన్ని స్వీకరిస్తున్న నటుడు మిథున్ చక్రవర్తి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ భూషణ్ పురస్కారాన్ని స్వీకరిస్తున్న ప్రముఖ గాయని ఉషా ఉతుప్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జులై నుంచి ప్రేమలో..
ప్రభాస్ ప్రేమకథకి ముహూర్తం కుదిరింది. జులై నుంచే ఆయన కొత్త ప్రేమాయణం మొదలు కానుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పక్కాగా సిద్ధమైనట్టు సినీ వర్గాలు తెలిపాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో... అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. -
సంయుక్త.. ఊ కొట్టేనా?
తెలుగు చిత్రసీమలోకి వచ్చిన అనతి కాలంలోనే వరుస విజయాలందుకుంటూ స్టార్ నాయిక స్థాయికి చేరుకుంది సంయుక్తా మేనన్. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘స్వయంభూ’తో పాటు శర్వానంద్‌తోనూ ఓ చిత్రం చేస్తోంది. -
ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది
‘నేను మొదటగా సంతోషపడేది నన్ను నేను తెరపై చూసుకున్నప్పుడే’ అని అంటోంది బాలీవుడ్ కథానాయిక యామీ గౌతమ్. ‘ఆర్టికల్ 370’తో భారీ విజయాన్ని అందుకుందీమె. హిందీలోనే కాదు తెలుగు చిత్రాల్లోనూ నటించి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. -
వాణీ కోసమే ఈ పాత్ర!
నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్ని ఎంచుకుంటూ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది బాలీవుడ్ నాయిక వాణీ కపూర్. ఇప్పుడామె మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. ఆమె ప్రధాన పాత్రలో ‘బడ్తమీజ్ గిల్’ అనే సినిమా రాబోతున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. -
‘కన్నప్ప’లో అక్షయ్ పని పూర్తి
‘కన్నప్ప’తో సినీప్రియుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు మంచు విష్ణు. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. -
సమ్మోహనం.. ఈ కలయిక
అపూర్వమైన కలయికలు కొన్ని ఉంటాయి. వాళ్లు కలిశారంటే చాలు... సినిమాకి క్లాప్ కొట్టిన రోజే బ్లాక్‌బస్టర్ బొమ్మని తెరపై చూసేసినంత సంబరం. రజనీకాంత్ - అమితాబ్ బచ్చన్ కలయిక అచ్చం అలాంటిదే. భారతదేశం గర్వించదగ్గ తారలు ఈ ఇద్దరూ. -
త్వరలో కుందాపురానికి ‘కాంతార 1’
‘కాంతార’ సినిమాతో జాతీయ స్థాయిలో సత్తా చాటారు రిషబ్ శెట్టి. ఇప్పుడీ సినిమాకి ప్రీక్వెల్‌గా ‘కాంతార: చాప్టర్ 1’ సిద్ధమవుతోంది. రిషబ్ హీరోగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. -
ఏమయ్యిందే గుండెకు.. ఏనాడు లేదే ఇంత ఉలుకు
అశోక్ గల్లా హీరోగా అర్జున్ జంధ్యాల తెరకెక్కిస్తున్న చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. వారణాసి మానస కథానాయిక. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. వారిద్దరూ ఎక్కడ మీట్ అయ్యారంటే?
తాజా వార్తలు (Latest News)
-
పేర్ని కిట్టూపై ఎందుకంత ప్రేమ?.. స్వామి భక్తి ప్రదర్శిస్తున్న పోలీసులు
-
దళిత యువకుడికి పోలీసుల చిత్రహింసలు.. డిగ్రీ పరీక్షలు రాయకుండా నిర్బంధం
-
గులకరాయి ఘటనను.. ఎన్నికల్లో లబ్ధికి వినియోగించుకోకుండా అడ్డుకోండి
-
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
-
హైదరాబాద్‌లో స్థానికేతరులకే పట్టం