Raveena Tandon: స్టూడియోలో ఫ్లోర్స్ క్లీన్ చేశా: రవీనా టాండన్
‘కేజీయఫ్-2’లో రమికా సేన్‌గా నటించి, ప్రేక్షకుల్ని మెప్పించిన బాలీవుడ్ నటి రవీనా టాండన్. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రవీనా.. అతి తక్కువ సమయంలోన....
నటి కావాలని ఎప్పుడూ అనుకోలేదు
ముంబయి: ‘కేజీయఫ్-2’లో రమికా సేన్‌గా నటించి, ప్రేక్షకుల్ని మెప్పించిన బాలీవుడ్ నటి రవీనా టాండన్. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రవీనా.. అతి తక్కువ సమయంలోనే వరుస విజయాలు అందుకున్నారు. ప్రస్తుతం ‘కేజీయఫ్-2’ విజయాన్ని ఆస్వాదిస్తున్న ఆమె తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. తాను ఎప్పుడూ నటి కావాలని భావించలేదని, అనుకోకుండా ఈ రంగంలోకి అడుగుపెట్టానని అన్నారు. నటిగా కెరీర్ ప్రారంభించడానికంటే ముందు తాను స్టూడియోలో ఫ్లోర్స్ శుభ్రం చేశానని చెప్పారు.
‘‘నేను నిజమే చెబుతున్నా. నటిగా కెరీర్ ప్రారంభించడానికంటే ముందు ప్రహ్లాద్‌కు అసిస్టెంట్‌గా పనిచేశాను. స్టూడియోలో ఫ్లోర్ క్లీన్ చేసేదాన్ని. ‘నువ్వు స్క్రీన్ వెనుక కాదు. స్క్రీన్‌పై నటించాలి. యాక్టింగ్‌కి నీ ఫేస్ సరిగ్గా నప్పుతుంది’ అని అక్కడ వాళ్లందరూ చెప్పేవాళ్లు. వాళ్ల మాటలు విని నవ్వుకునేదాన్ని. ‘నేనా? నటినా?నాకస్సలు ఆ ఉద్దేశమే లేదు’ అని సమాధానమిచ్చా. కొన్ని రోజుల తర్వాత పాకెట్ మనీ కోసం ప్రహ్లాద్ వద్ద మోడల్‌గా వర్క్ చేశా. అలా, నేను మోడలింగ్‌లోకి రావడం.. అక్కడ మంచి పేరు సొంతం చేసుకున్న సినిమాల్లో అవకాశాలు రావడంతో నటిగా మారాల్సి వచ్చింది.’’ అని రవీనా వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పేర్ని కిట్టూపై ఎందుకంత ప్రేమ?
-
దళిత యువకుడికి పోలీసుల చిత్రహింసలు.. డిగ్రీ పరీక్షలు రాయకుండా నిర్బంధం
-
గులకరాయి ఘటనను.. ఎన్నికల్లో లబ్ధికి వినియోగించుకోకుండా అడ్డుకోండి
-
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
-
హైదరాబాద్‌లో స్థానికేతరులకే పట్టం