Updated : 08 Jan 2022 16:18 IST

Rhea Chakraborty: అమ్మాయిలు... ఇన్‌స్టాగ్రామ్‌ వలలో పడకండి.. ఎందుకంటే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటనాపరంగా కాకుండా బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్ అనుమానస్పద మృతి కేసు, డ్రగ్స్‌ ఆరోపణ వార్తల్లో ఎక్కువగా నిలిచారు బాలీవుడ్‌ నటి రియా చక్రవర్తి. జైలు నుంచి బయటకొచ్చినామె... తన సామాజిక మాధ్యమాల్లో సందేశాత్మక పోస్టులను పెడుతున్నారు. యోగా, మానసిక వికాసంతో కూడిన అంశాలను తరచూ పంచుకుంటున్నారు.  తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అమ్మాయిలకు ఓ ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేశారు. ‘‘ఇన్‌స్టాగ్రామ్‌ యాప్ వాడే అమ్మాయిలకు ముఖ్య గమనిక. అందంగా కనిపించేందుకు ఇన్‌స్టాలో ఉండే ఇన్‌స్టా బ్యూటీ, ఇన్‌స్టా ఫిల్టర్స్‌ను ఉపయోగించకండి. అదో మాయ. దాని వలలో పడకండి. మీరెలా ఉన్నారో అదే మీ అందం. దాన్నే అంగీకరించండి. స్వాగతించండి. ఈమధ్య కాలంలో నువ్వు ఈ ఇన్‌స్టా బ్యూటీ, ఫిల్టర్స్‌ ఫీచర్స్‌ గురించి ఎలా ఫీల్‌ అవుతున్నావ్‌ అని నాకు మెసేజ్‌లు పంపిస్తున్నారు. వారందరికీ నేను చెప్పే సమాధానం ఒకటే..మీకు మీరుగా ఉండటమే నిజమైన అందం’’ అని జవాబిచ్చారు. కాగా గతేడాది విడుదలైన అమితాబ్‌ బచ్చన్‌, ఇమ్రాన్‌ హష్మీ కీలక పాత్రలు పోషించిన  మిస్ట్రరీ థ్రిల్లర్‌ చిత్రం ‘చెహ్రే’లో కనిపించారు.  

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్