Satyadev: ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు.. టికెట్లు ఇప్పించాలని నెటిజన్ ట్వీట్.. సత్యదేవ్ కౌంటర్
‘లవ్ మాక్‌టైల్’కు రీమేక్‌గా తెరకెక్కిన ‘గుర్తుందా శీతాకాలం’ డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో సత్యదేవ్ వరుస ప్రమోషన్స్‌లో బిజీగా పాల్గొంటున్నారు. తాజాగా ఆయన నెటిజన్లతో ట్విటర్ చాట్ నిర్వహించారు.
హైదరాబాద్: ‘గాడ్‌ఫాదర్’ (Godfather), ‘రామ్‌సేతు’ (Ramsetu)లో కీలకపాత్రలు పోషించి సినీ ప్రముఖులు, అభిమానుల ప్రశంసలు అందుకున్నారు నటుడు సత్యదేవ్. ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’ (Gurthunda Seethakalam) ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఆయన.. తాజాగా నెటిజన్లతో ట్విటర్ చాట్‌లో పాల్గొన్నారు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు..
‘రామ్‌సేతు’లో ఏపీగా మీ నటన నాకెంతో నచ్చింది. మీ తదుపరి చిత్రాలను హిందీలోనూ విడుదల చేయండి? లేదా బాలీవుడ్ చిత్రాల్లో నటించండి?
సత్యదేవ్: మీరు నాపై చూపిస్తోన్న ప్రేమాభిమానాలకు సంతోషిస్తున్నా. భవిష్యత్తులో తప్పకుండా మిమ్మల్ని అలరించడానికి మరిన్ని ప్రాజెక్ట్‌లు చేస్తాను.
ఒకవేళ నటుడు కాకపోయి ఉంటే మీరు ఏ రంగాన్ని ఎంచుకునేవారు?
సత్యదేవ్: నువ్వు అడిగే వరకూ ఆలోచించలేదు. దర్శకుడిని అయ్యేవాడినేమో.
ఎన్టీఆర్‌తో కలిసి మీరు నటిస్తే చూడాలని ఉంది?
సత్యదేవ్: గట్టిగా కోరుకోండి. నేను కూడా ఎదురుచూస్తున్నా.
‘రామ్‌సేతు’ కోసం అక్షయ్‌కుమార్‌తో కలిసి పనిచేయడం ఎలా ఉంది?
సత్యదేవ్: అక్షయ్ కుమార్ అంటే ప్రేమ. ఆయనతో మరెన్నో చిత్రాల్లో నటించాలని ఉంది. ఈ సినిమా తర్వాత ఆయనకు వీరాభిమాని అయిపోయా.
రీమేక్స్ మీద ప్రేక్షకులు ఆసక్తి కనబర్చడం లేదు కదా. అలాంటప్పుడు ‘గుర్తుందా శీతాకాలం’ను థియేటర్లో ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? ఓటీటీకి ఇవ్వొచ్చుగా
సత్యదేవ్: ఓటీటీకి అడిగారు. కాకపోతే, ఈ చిత్రాన్ని థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్ వస్తుందని భావించాం.
చిరంజీవితో కలిసి వర్క్ చేయడం ఎలా ఉంది?
సత్యదేవ్: మేజికల్‌గా అనిపించింది. ఆ రోజుల్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటా.
నువ్వు ఏం చేస్తావో తెలియదు.. పవన్-సుజిత్ సినిమాలో మాకు అనిరుధ్ కావాలి?
సత్యదేవ్: నాది కూడా సేమ్ ఫీలింగ్.
‘గుర్తుందా శీతాకాలం’ ఎలా ఉండనుంది?
సత్యదేవ్: నవ్వుతారు, ప్రేమిస్తారు, కన్నీరు పెట్టుకుంటారు. సినిమా చూశాక.. దీన్ని చూడమని మీ స్నేహితులకు తప్పకుండా చెబుతారు. అలాగే, ఒకే టికెట్‌పై మూడు ప్రేమ కథలు చూడనున్నారు.
తమన్నాతో కలిసి పనిచేయడం ఎలా ఉంది? ఆమె నుంచి ఏం నేర్చుకున్నారు?
సత్యదేవ్: వృత్తి పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తి. స్వీట్ హార్ట్
నీ పలుకుబడి ఉపయోగించి #SSMB28 అప్డేట్ ఇప్పించు..!
సత్యదేవ్: నా పలుకుబడితో ‘గుర్తుందా శీతాకాలం’ టికెట్ ఇప్పించగలను. కానీ, #SSMB28 అప్డేట్ ఎలా?
సినిమాపై కాస్త కూడా ఆసక్తి రావడం లేదు. బాగుంటే మెసేజ్ చెయ్.. టికెట్ బుక్ చేసుకుంటా?
సత్యదేవ్: చూశాను.. బాగుంది.. బుక్ చేసుకో..
మీ డ్రీమ్ రోల్ ఏమిటి?
సత్యదేవ్: చిరంజీవి చేసిన చంటబ్బాయ్!!
నాకు ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు. మీ సినిమా కథ నాకు కనెక్ట్ అయ్యేలా ఉంది. మూడు టికెట్లు ఇప్పించండి..!
సత్యదేవ్: మూడు టికెట్లా? అంటే నువ్వు రావడం లేదా?
‘రామ్‌సేతు’లో ఏపీ పాత్ర పోషించడానికి మీరు ఎలా సన్నద్ధమయ్యారు?
సత్యదేవ్: పూర్తిగా శాకాహారిగా మారాను. సుమారు రెండు నెలలపాటు సోషల్‌మీడియాకు దూరంగా ఉన్నాను.
పవన్‌కల్యాణ్, రామ్‌చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ గురించి ఏమైనా చెప్పండి?
సత్యదేవ్: పవర్‌స్టార్ - ఫైర్ స్ట్రోమ్
చరణ్ - మోస్ట్ లవబుల్ స్టార్ ఆఫ్ ఇండియా
తారక్ - టార్చ్ బేరర్
బన్నీ - ఐకాన్
ప్రభాస్ - మిస్టర్ పర్ఫెక్ట్
చిరంజీవి గురించి ఒక్కమాటలో చెప్పండి?
సత్యదేవ్: ఆయన గురించి ఒక్క మాటలో చెప్పడం చాలా కష్టం. ఆయన అంటే చాలా ప్రేమా, అభిమానం ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్‌తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్‌పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్‌లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్‌మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్‌కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్. -
Sundeep Kishan: అలా చేసుంటే మీ సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యేది: సందీప్ కిషన్‌తో అభిమాని
తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించారు హీరో సందీప్ కిషన్. -
Janhvi Kapoor: నాన్న ఆ విషయం నాకూ చెప్పలేదు: జాన్వీ కపూర్
బాలీవుడ్ నటి జాన్వీకపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘దేవర’ సినిమా విశేషాలతో పాటు మరికొన్ని సంగతులు పంచుకున్నారు. -
Varun Tej: ఆ సీక్వెల్లో నేనెందుకు నటిస్తా?.. చరణ్ చేస్తాడు: వరుణ్ తేజ్
వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన పాల్గొని సందడి చేశారు. -
Miss World 2024 Pageant: నాపై ఒత్తిడేమీ లేదు.. మిస్ వరల్డ్ -2024 పోటీదారు సినిశెట్టి.. ఆసక్తికర కబుర్లు
Miss World 2024: ఫిబ్రవరి 18 నుంచి భారత్ వేదికగా మిస్ వరల్డ్ 2024 పోటీలు జరగనున్న నేపథ్యంలో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి పంచుకున్న విషయాలు.. -
Prudhvi Raj: ఆ కష్ట సమయంలో నన్ను ఆదుకుంది ఇండస్ట్రీనే: పృథ్వీరాజ్
హాస్యనటుడు బలిరెడ్డి పృథ్వీరాజ్ ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన సినీ, రాజకీయ అనుభవాలను పంచుకున్నారు. -
Ravi Teja: ఆ విషయం ముందే చెప్పడం నాకు ఇష్టంలేదు: వరుణ్‌తేజ్‌తో రవితేజ
రవితేజ, వరుణ్ తేజ్.. తమ కొత్త చిత్రాల విశేషాలను ఒకరికొకరు పంచుకున్నారు. అవేంటో చూసేయండి.. -
Venu: అలా అనుకొనే వారికి సమాధానమే ‘బలగం’..: వేణు యెల్దండి
హాస్యనటుడు, దర్శకుడు వేణు యెల్దండి ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన సినీ జీవితం, అనుభవాలను పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్