ShahRukhKhan: ‘డంకీ’ బడ్జెట్‌పై నెటిజన్‌ ట్వీట్‌.. షారుక్‌ ఏమన్నారంటే..?

షారుక్‌ ఖాన్‌ (Shahrukh Khan) ప్రధాన పాత్రలో నటించిన కామెడీ డ్రామా డంకీ (Dunki). రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్‌ 21న విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది.

Published : 27 Dec 2023 18:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: షారుక్‌ ఖాన్‌ (Shahrukh Khan), తాప్సీ (Taapsee), విక్కీ కౌశల్‌ (Vicky Kaushal) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డంకీ’ (Dunki). రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకుడు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంతటా పాజిటివ్‌ టాక్‌ దక్కించుకుంది. ‘డంకీ’ (Dunki) చిత్రానికి అభిమానుల నుంచి వస్తోన్న స్పందన పట్ల ఆనందం వ్యక్తం చేశారు షారుక్‌ ఖాన్‌ (Shah rukh Khan). ఈ మేరకు బుధవారం ఎక్స్‌ వేదికగా ఫ్యాన్స్‌తో కాసేపు ముచ్చటించారు. ‘డంకీ’ సినిమా గురించి పలువురు అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆయన సరదాగా బదులిచ్చారు.

సినిమా, వ్యాపారం, ట్రావెలింగ్‌, షోలు.. ఇలా వరుస పనులతో మీకు అలసట రావడం లేదా? మీరు ఫిట్‌గా ఉండటానికి కారణం ఏమిటి?

షారుక్‌: ఫిట్‌నెస్‌ అనేది మన ఆలోచనా విధానంపై ఆధారపడి ఉంటుంది. ప్రేమించేవారు చుట్టూ ఉండటంతో నేను ఎప్పుడూ సంతోషంగానే ఉంటా. సంతోషకరమైన క్షణాలు ఫిట్‌గా ఉండేందుకు దోహదపడతాయి. సానుకూల ఆలోచనలు.. చిన్న చిన్న ఆనందాలు నన్ను ఫిట్‌గా ఉంచుతాయి.

మీ గురించి అనవసరమైన కథనాలు వైరల్‌గా మారినప్పుడు.. వాటిపై స్పందించకుండా ఎలా ఉండగలుగుతున్నారు?

షారుక్‌: విషయం ఏదైనా సరే.. ప్రతిఒక్కరికీ వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. నేను నమ్మకంతో పనిచేస్తా. ఎదుటివారి అభిప్రాయాలకు అనుగుణంగా పనిచేయను.

‘డంకీ’కి సంబంధించి మీకు బాగా నచ్చిన క్షణాలు? ఆ సినిమాలో మీకు ఇష్టమైన పాట?

షారుక్‌: సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఫన్నీ ఇంటర్వ్యూలు. ‘ఓ మహీ’ పాట నాకెంతో నచ్చింది.

‘పఠాన్‌’, ‘జవాన్‌’, ‘డంకీ’.. ఏ చిత్రం కోసం ఎక్కువగా శ్రమించారు?

షారుక్‌: వైవిధ్యమైన భావోద్వేగాలను పండించడం నటులకు కష్టమైన విషయం. ఆ విధంగా చూస్తే ‘డంకీ’ కోసం ఎక్కువగా శ్రమించా.

30 ఏళ్ల సినీ కెరీర్‌లో మీరు నేర్చుకున్న విషయం ఏమిటి?

షారుక్‌: ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడం కంటే విలువైన బహుమతి మరొకటి లేదు.

Rajinikanth: ఆయన రాజకీయాల్లోకి రానందుకు బాధపడ్డా: రజనీకాంత్‌ సతీమణి కీలక వ్యాఖ్యలు

ఈరోజు సల్మాన్‌ఖాన్‌ బర్త్‌డే. ఆయనకు విషెస్‌ చెప్పండి?

షారుక్‌: ఆ విషయం నాకు తెలుసు. విషెస్‌ కూడా చెప్పా. కాకపోతే, విషెస్‌ని నేను ఎప్పుడూ సోషల్‌మీడియాలో చెప్పను. ఎందుకంటే, ఇది వ్యక్తిగతమైన విషయం కదా.

‘డంకీ’ బడ్జెట్‌ గురించి ఎంతో ప్రచారం జరుగుతుంది. కొంతమంది రూ.85 కోట్లు అంటున్నారు. మరి కొంతమంది రూ.120 కోట్లు అంటున్నారు. ఇంతకీ ఏది నిజం?

షారుక్‌: బ్రదర్‌.. ఎవరికి ఇష్టం వచ్చింది అనుకోని. ఇలాంటి వాటిపై కాకుండా వేరే విషయాలపై కాస్త దృష్టి పెట్టు.

‘డంకీ’, ‘జవాన్‌’ చిత్రాలకు మార్కెటింగ్‌ సరిగ్గా చేయలేదు. కాబట్టి ‘రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ టీమ్‌లోకి నైపుణ్యం కలిగిన వారిని తీసుకోండి?

షారుక్‌: నా చిత్రాలకు నేనే మార్కెటింగ్‌ చేసుకున్నా. కాబట్టి నన్ను నేనే ఉద్యోగం నుంచి ఎలా తొలగించుకుంటా.

మీరు ఇంగ్లిష్‌ చాలా చక్కగా మాట్లాడతారు. అలాంటప్పుడు రాజ్‌కుమార్‌ హిరాణీ ‘డంకీ’లోకి మిమ్మల్ని ఎందుకు ఎంచుకున్నారు?

షారుక్‌: రొమాంటిక్‌ సీన్స్‌లో నేను చక్కగా యాక్ట్‌ చేస్తా. అలాంటి నన్ను ‘పఠాన్‌’, ‘జవాన్‌’ లాంటి యాక్షన్‌ చిత్రాల్లోకి ఎంచుకున్నారు కదా. అలాగే ‘డంకీ’లోకి కూడా ఎంచుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని