Rajinikanth: ఆయన రాజకీయాల్లోకి రానందుకు బాధపడ్డా: రజనీకాంత్‌ సతీమణి కీలక వ్యాఖ్యలు

రజనీకాంత్‌ (Rajinikanth) సతీమణి లత ఇటీవల ఓ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. రజనీకాంత్‌ పొలిటికల్‌ ఎంట్రీ, ‘కొచ్చాడయాన్‌’ వివాదంపై ఆమె మాట్లాడారు. 

Updated : 27 Dec 2023 16:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌ (Rajinikanth) రాజకీయాల్లోకి రాకపోవడంపై ఆయన సతీమణి లత (Latha) కీలక వ్యాఖ్యలు చేశారు. రజనీ రాజకీయాల్లోకి అడుగుపెట్టకపోవడం తనను బాధించిందన్నారు. ‘‘ఆయనలో నిజమైన నాయకుడిని చూశా. బలమైన కారణంతోనే ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదు. ప్రస్తుతం తమిళనాడులో ఉన్న పరిస్థితుల దృష్ట్యా.. ఆయనే కనుక రాజకీయాల్లో ఉండి ఉంటే సూపర్‌ పవర్‌గా ఎదిగేవారు’’ అని ఇటీవల జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో తెలిపారు.

‘కొచ్చాడయాన్‌’ చీటింగ్‌ కేసు గురించీ ఆమె ఈ ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. ‘‘సమాజంలో పేరు పొందిన వ్యక్తిని అవమానించేందుకు  పెట్టిన కేసు ఇది. సెలబ్రిటీలుగా ఉన్నందుకు మేము మూల్యం చెల్లించుకుంటున్నాం. ఈ కేసు పెద్దది కాకపోవచ్చు కానీ దీని గురించి భారీగానే ప్రచారం జరిగింది. నిజం చెప్పాలంటే ఇందులో ఎలాంటి మోసం జరగలేదు. పలు కథనాల్లో ప్రచురితమైనట్లు ఆ డబ్బుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అది పూర్తిగా మీడియా వన్‌, సంబంధిత వ్యక్తులకు మధ్య జరిగిన వ్యవహారం. ఇప్పటికే వాళ్లు ఈ సమస్యను సెటిల్‌ చేసుకున్నారు. ఈ విషయంలో నేను కేవలం హామీదారుగా మాత్రమే ఉన్నా’’ అని ఆమె చెప్పారు.

Devil: ‘డెవిల్‌’ వివాదం.. దర్శకుడిగా క్రెడిట్‌ ఇవ్వకపోవడం బాధించింది: నవీన్‌ మేడారం

రజనీకాంత్‌ కథానాయకుడిగా ఆయన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో 2014లో వచ్చిన 3డీ మోషన్‌ క్యాప్చర్‌ మూవీ ‘కొచ్చాడయాన్‌’. దీపిక పదుకొణె కథానాయిక. మీడియా వన్‌ గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌ బ్యానర్‌పై ఇది నిర్మితమైంది. ఈ సినిమా నిర్మాణ పనులకు బెంగుళూరుకి చెందిన యాడ్‌ బ్యూరో అడ్వర్టైజింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి మీడియా వన్‌ గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌ డైరక్టర్లలో ఒకరైన మురళీ మనోహర్‌ రుణం తీసుకున్నట్లు, ఇందుకు లతా రజనీకాంత్‌ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మురళీ మనోహర్‌.. తమకు డబ్బులు తిరిగి చెల్లించలేదంటూ యాడ్‌ బ్యూరో అడ్వర్టైజింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కొంతకాలం క్రితం కోర్టును ఆశ్రయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని