Shaktimaan: శక్తిమాన్.. మళ్లీ వచ్చేస్తున్నాడు.. ఈసారి వెండితెరపై!
‘శక్తిమాన్’.. ఈపేరు ఒకప్పుడే కాదు.. ఇప్పటికీ ఫేమస్. డీడీ నేషనల్‌లో 1997 నుంచి 2005 వరకు ఈ సీరియల్ ప్రసారమై.. టీవీ ప్రేక్షకుల మనసు దోచింది. ఇప్పుడదే ‘శక్తిమాన్’ సినిమాగా రాబోతుంది. 90వ దశకంలో ఇది సృష్టించిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇండియా ఫస్ట్ సూపర్ హీరో క్యారెక్టర్గా పేరు తెచ్చుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ‘శక్తిమాన్’.. ఈపేరు గతంలోనే కాదు.. ఇప్పటికీ ఫేమస్సే. డీడీ నేషనల్‌లో 1997 నుంచి 2005 వరకు ఈ సీరియల్ ప్రసారమై.. టీవీ ప్రేక్షకుల మనసు దోచింది. ఇప్పుడదే ‘శక్తిమాన్’ సినిమాగా రాబోతుంది. 90వ దశకంలో ఇది సృష్టించిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇండియా ఫస్ట్ సూపర్ హీరో క్యారెక్టర్గా పేరు తెచ్చుకుంది. ‘శక్తిమాన్’ పాత్రను నటుడు, నిర్మాత ముఖేశ్ ఖన్నా పోషించారు. ఇందులో సూపర్ హీరోగా సాహసాలు చేస్తూ ప్రజలను కాపాడుతూ ఉంటాడు. అప్పటి పిల్లలకి ఈ పాత్ర ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఆ పాత్ర గెటప్ కూడా వెరైటీగా ఉండటం, ప్రజలకీ బాగా చేరువకావడంతో ఆ పాత్ర ఫొటోలను చాలా కంపెనీలు తమ ప్రచారానికి వాడుకొన్నాయి.
తాజాగా శక్తిమాన్ సినిమా రూపంలో మరింత కొత్తగా రాబోతుంది. సోనీ పిక్చర్స్ ఆధ్వర్యంలో మరో రెండు సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇండియాలోని సూపర్‌స్టార్ అయిన ఒకరు ఈసారి ఈ పాత్రలో కనిపించనున్నట్లు తెలిపింది. అప్పటి శక్తిమాన్ ముఖేష్ ఖన్నా కూడా ఇందులో భాగమవ్వనున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటులు సల్మాన్ ఖాన్, హృతిక్‌రోషన్, రణ్‌వీర్ సింగ్, సిద్ధార్థ్ మల్హోత్రా, సోనూసూద్.. వీరిలో ఒకరు ఆ పాత్ర పోషించనున్నట్లు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Raghurama: వైకాపాలో తిరగబడే రోజులు మొదలయ్యాయి: ఎంపీ రఘురామ
-
World News
Rishi Sunak: రిషి సునాక్ 100 రోజుల ప్రతిన..
-
Crime News
Andhra News: వాగులో దూకి నిందితుడి పరారీ.. పోలీసులు గాలించినా లభించని ఆచూకీ
-
Movies News
K.Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
-
General News
Telangana News: కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!