venkatesh: పల్లెటూరి కథలో వెంకీ!

విజయవంతమైన కలయికలో సినిమాకి రంగం సిద్ధమైంది. అగ్ర కథానాయకుడు వెంకటేశ్‌తో... అనిల్‌ రావిపూడి ఓ సినిమా చేయనున్నారు. ఈ కలయికలో సినిమా కోసం కథ దాదాపుగా సిద్ధమైంది.

Updated : 03 Feb 2024 10:03 IST

విజయవంతమైన కలయికలో సినిమాకి రంగం సిద్ధమైంది. అగ్ర కథానాయకుడు వెంకటేశ్‌తో... అనిల్‌ రావిపూడి ఓ సినిమా చేయనున్నారు. ఈ కలయికలో సినిమా కోసం కథ దాదాపుగా సిద్ధమైంది. కుటుంబం, పల్లెటూరి నేపథ్యాల్ని మేళవించిన ఓ కథని సిద్ధం చేసినట్టు సమాచారం. పట్టణంతోనూ ఈ కథ ముడిపడి ఉంటుందని తెలిసింది. ఈ వేసవిలోపే సినిమాని పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘ఎఫ్‌ 3’ తర్వాత అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో... వెంకటేశ్‌ చేస్తున్న చిత్రమిదే. దిల్‌రాజు నిర్మించనున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ సినిమాపై మరింత స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ఇటీవల  ‘భగవంత్‌ కేసరి’తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు అనిల్‌ రావిపూడి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని