Updated : 31/10/2020 11:06 IST

అమెరికాను మళ్లీ కమ్మేస్తున్న కరోనా!

14 రోజుల్లో 10లక్షల కేసులు

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా కేసులు మునుపెన్నడూ లేని స్థాయిలో నమోదవుతున్నాయి. జులై-ఆగస్టులో తీవ్రరూపం దాల్చిన మహమ్మారి.. మళ్లీ ఇప్పుడు అంతకంటే భారీ స్థాయిలో విజృంభిస్తోంది. గత రెండు రోజులుగా 90 వేలకు పైగా కేసులు నమోదవుతుండడం అక్కడి తీవ్రతను తెలియజేస్తోంది. దాదాపు 24 రాష్ట్రాలు తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి.

97,080 కొత్త కేసులు... 

కొవిడ్‌-19 ట్రాకింగ్‌ ప్రాజెక్ట్‌ గణాంకాల ప్రకారం.. శుక్రవారం 97,080 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 90,36,850కి చేరింది.  క్రితం రోజుతో పోలిస్తే ఈ సంఖ్య భారీగా పెరగడం గమనార్హం. ఇక శుక్రవారం కొత్తగా 933 మంది మహమ్మారికి బలయ్యారు. దీంతో మృతుల సంఖ్య 2,29,594కు పెరిగింది. ప్రపంచంలోనే అత్యధిక కొవిడ్‌ కేసులు, మరణాలు సంభవించిన దేశం అమెరికానే. దాదాపు 24 రాష్ట్రాల్లో వ్యాధి తీవ్రత ఆందోళనకరంగా ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ కరోనా విషయంలో పురోగతి కనిపిస్తున్న దాఖలాలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కేసుల సంఖ్యలో ఇప్పటి వరకు తొలిస్థానంలో ఉన్న కాలిఫోర్నియాను టెక్సాస్‌ రెండో స్థానానికి నెట్టింది. మూడో స్థానంలో ఫ్లోరిడా కొనసాగుతోంది.

ప్రతి పది వేల మందిలో 272 మందికి కరోనా...

ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య, మృతుల సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోంది. ఒక్క శుక్రవారం రోజే కొత్తగా 46,600 మంది ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. గత రెండు వారాల్లో ఈ సంఖ్య 25 శాతం పెరిగింది. నెల క్రితం 700గా ఉన్న సగటు మరణాలు.. గత వారం రోజుల్లో 800గా నమోదయింది. జులై-ఆగస్టు మధ్యకాలంలో పది లక్షల కేసుల నమోదు కావడానికి సగటున 16 రోజులు పట్టింది. కానీ, తాజాగా చివరి పది లక్షల కేసులు మాత్రం 14 రోజుల్లోనే నమోదయ్యాయి. ప్రస్తుతం అమెరికాలో ప్రతి పది వేల మందిలో 272 మంది వైరస్ బారిన పడ్డారు. ఏడుగురు మరణించారు. అదే ఈ సంఖ్య ఐరోపాలో వరుసగా 127, నాలుగుగా ఉంది. మరో నాలుగు రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో కొవిడ్‌ కేసుల పెరుగుదల తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని