సెప్టెంబరులో ఆప్తా నేషనల్ కాన్ఫరెన్స్: ఉదయ భాస్కర్

సెప్టెంబరు చివరి వారంలో ఆప్తా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ను నిర్వహించనున్నట్లు అసోసియేషన్‌ అధ్యక్షుడు ఉదయ భాస్కర్‌ తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తామన్నారు.

Published : 26 Feb 2023 19:19 IST

అట్లాంటా : అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోషియేషన్ (APTA) ఏర్పాటు చేసి 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జాతీయ సదస్సును ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆప్తా అధ్యక్షుడు ఉదయ భాస్కర్ కొట్టే తెలిపారు. ఆప్తా నూతన కార్యవర్గం అట్లాంటాలో సమావేశమై 2023-2024 రోడ్ మ్యాప్‌పై చర్చించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా అట్లాంటాలో పలు వేదికలను నిర్వాహకులు పరిశీలించారు. సెప్టెంబరు చివరి వారంలో నిర్వహించే ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి అగ్ర కథానాయకుడు చిరంజీవి, పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ, సాహిత్య కళాకారులను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ఆప్తా కార్యవర్గ సమావేశంలో బోర్డు ఛైర్‌పర్సన్‌ సుబ్బు కోట, ఆప్తా పూర్వ అధ్యక్షులు, ఇతర బోర్డు సభ్యులు, కార్యవర్గ సభ్యులు, అట్లాంటా ఆప్తా ప్రముఖులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు