మిరియాల మురళీధర్‌కు ఆటా ఎక్స్‌లెన్స్‌ అవార్డు

Published : 10 Jun 2024 20:08 IST

జపాన్‌లో నివాసం ఉంటున్న ప్రవాస భారతీయుడు, శాస్త్రవేత్త మిరియాల మురళీధర్‌కు ఆటా అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ATA) అవార్డు అందజేసింది. 18వ ఆటా సదస్సులో భాగంగా ఆయనకు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగంలో ఎక్స్‌లెన్స్‌ అవార్డును నిర్వాహకులు అందజేశారు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతులమీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. అవార్డు అందుకోవడంపై మురళీధర్‌ సంతోషం వ్యక్తంచేశారు. ఆటా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలోని తన పాత మిత్రులను కలుసుకునే అవకాశం లభించిందన్నారు. తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు సహా పలువురు రాజకీయ నాయకులను కలుసుకునే అవకాశం ఈ వేదిక ద్వారా దక్కిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని