Veera Simha Reddy: బే ఏరియాలో ‘వీరసింహారెడ్డి’ ఫీవర్.. ఫ్యాన్స్ హంగామా

నందమూరి బాలకృష్ణ (Balakrishna) ప్రధాన పాత్రలో నటించిన ‘వీర సింహారెడ్డి’ (Veera Simha Reddy) సినిమా విడుదల సందర్భంగా విదేశాల్లోనూ సందడి వాతావరణం నెలకొంది.

Published : 13 Jan 2023 07:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘గాడ్ ఆఫ్ మాస్’ నందమూరి నటసింహం బాలకృష్ణ (Bala krishna), డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘వీర సింహారెడ్డి’ (Veera Simha Reddy). ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా జనవరి 12న విడుదలైన విషయం తెలిసిందే. ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహ నాయుడు’, ‘సింహా’, ‘లెజెండ్’ వంటి ఫుల్‌ మాస్‌, ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌ కథలో చాలా రోజుల తర్వాత బాలయ్య నటించడంతో థియేటర్ల వద్ద అభిమానులు వేడుకలు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లోనూ సినిమా హాళ్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది.

అమెరికాలోని బే ఏరియాలో ‘వీర సింహారెడ్డి’ ఫీవర్ మరోస్థాయిలో ఉంది. కళ్యాణ్ కోట అండ్ ఫ్రెండ్స్ CineMax 4kకి కొత్త హంగులు అద్దారు. భారీ కటౌట్లు ఏర్పాటు చేసి పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి సినిమా విజయం సాధించిందంటూ హర్షం వ్యక్తం చేశారు. అమెరికాలోని ప్రముఖ ప్రవాసాంధ్రుడు, టీడీపీ ఎన్నారై నేత, జయరాం కోమటి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరై సందడి చేశారు. శాన్‌ఫ్రాన్సిస్కో కాన్సుల్ జ‌న‌ర‌ల్ డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ కుటుంబ సమేతంగా వచ్చి సినిమాను వీక్షించారు. బాలయ్య అభిమానులు కళ్యాణ్ కోట, స్వరూప్ వాసిరెడ్డి, మోహన్ సుగ్గల, శ్రీకాంత్ దొడ్డపనేని, లక్ష్మణ్ పరుచూరి, గంగా కోమటి, మధు కండేపి, సతీష్ బొల్లా, ప్రకాష్, సత్యనారాయణ తిపిర్నేని, మురళి గొడవర్తి, రజనీకాంత్ కాకర్ల, వెంకట్ కోగంటి, సుబ్బారావు తలచిరు, వెంకట్ సాధినేని, అమర్ అనుగంటి, అనిల్ కుమార్ యడ్లపల్లి, బద్రి బైండ్ల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని