Bandi Sanjay: అమెరికాలో బండి సంజయ్‌ పర్యటన.. పాల్గొనే కార్యక్రమాలివే..

భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ అమెరికా పర్యటనకు వెళ్లారు. సెప్టెంబర్‌ 1 తెల్లవారుజామున బయల్దేరి వెళ్లిన ఆయన.. పది రోజుల పాటు అక్కడే ఉండనున్నారు.

Updated : 01 Sep 2023 11:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ అమెరికా పర్యటనకు వెళ్లారు. సెప్టెంబర్‌ 1 తెల్లవారుజామున బయల్దేరి వెళ్లిన ఆయన.. పది రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. సెప్టెంబర్‌ 2న అట్లాంటాలో జరిగే ఆప్తా (అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్) 15వ వార్షికోత్సవంలో సంజయ్‌ ప్రసంగించనున్నారు. 

ఆ తర్వాత అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో ఓవర్సీస్‌ ఫ్రెండ్స్‌ ఆఫ్‌ బీజేపీ (ఆఫ్‌ బీజేపీ) ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆఫ్‌ బీజేపీ అధ్యక్షుడు అడపా ప్రసాద్‌, మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఏనుగుల తెలిపారు. దీనిలో భాగంగా ఓవర్సీస్‌ ఫ్రెండ్స్‌ ఆఫ్‌ బీజేపీ తెలంగాణ చాప్టర్‌ కన్వీనర్‌ విలాస్‌రెడ్డి జంబుల, లీడ్‌ వాలంటీర్లు శ్రీనివాస్‌ కొంపల్లి, అరవింద్‌ మోదిని ఆధ్వర్యంలో ఐదు రాష్ట్రాల్లోని ఆరు పట్టణాల్లో ఆత్మీయ సమావేశాలు (మీట్‌ అడ్‌ గ్రీట్‌) నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు బండి సంజయ్‌ హాజరు కానున్నారు. 

దీనిలో భాగంగా సెప్టెంబర్‌ 3న అట్లాంటాలో, 4న వివేక్‌ హాల్‌ (ఛార్లెట్‌, నార్త్‌ కరోలినా), 5న సీసన్స్‌@తాండూర్‌ బాంకెట్‌ హాల్‌ (నార్త్‌కరోలినా)), 6న వర్జీనియాలోని ఫెయిర్‌ఫాక్స్‌, 8న హాలిడే ఇన్‌ హాజలెట్‌ (న్యూజెర్సీ), 9న ప్లేనో-డాలస్‌ (టెక్సాస్‌)లో జరిగే సమావేశాల్లో బండి సంజయ్‌ పాల్గొని ప్రసంగించనున్నారు. దీంతో పాటు తెలుగు, తెలంగాణ ప్రవాస సంఘాలతో ఆయన భేటీ అవుతారు. ఆయా సమావేశాల్లో రాజకీయ, సినీ, సాహిత్య, వైద్య, వ్యాపార, సేవ, నాటక రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు. అమెరికాలోని వివిధ నగరాలకు చెందిన పూర్వ విద్యార్థి నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, ఎన్నారైలతో సంజయ్‌ మాట్లాడతారు. అనంతరం సెప్టెంబర్‌ 10న అమెరికా పర్యటనను ముగించుకుని ఆయన స్వదేశానికి తిరిగి చేరుకోనున్నారు.

బండి సంజయ్‌ పర్యటన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు, ప్రవాస విద్యార్థి పరిషత్‌ పూర్వ విద్యార్థులు, భాజపా మిత్ర సంఘానికి చెందిన మిత్రులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరిలో వంశీ యంజాల, శ్రీనివాస్ నాతి, రాజు కుర్రపాటి, సుభాష్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి యేలు, లక్ష్మీనారాయణ పేరి, సాయి సూదిని, అజయ్‌, శేఖర్‌ నల్లబోతుల, వినయ్‌, సంపత్‌, సుధాకర్‌, రఘు, వికాస్‌, కార్తికేయ, శ్యామ్‌ సుందర్‌, నికేత్‌ సాయిని, సంతోష్‌రెడ్డి, ప్రదీప్‌ కట్ట, శ్రీకాంత్‌ తుమ్మల, రమేశ్‌ కలవల, సంతోష్‌ వేముల, కృష్ణా గుడిపాటి, ఉపేన్‌ నందిపల్లి, ఓం నక్క, గోవింద్‌ రాజులు, రఘు, విజయ్‌ కుందూరు, శరత్‌ వేముల, గోపి సముద్రాల, రామ్‌ వేముల, కృష్ణ, శంకర్‌రెడ్డి, ఆదిత్య, రామకృష్ణ జీవీఎస్‌, గోపి చిలుకూరు, శ్రీనివాస్‌ కొంపల్లి తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని