Bathukamma: బ్రిస్బేన్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

తెలంగాణ సంస్కృతికి అద్దంపట్లే బతుకమ్మ పండుగను ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో

Updated : 03 Jan 2024 16:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలంగాణ సంస్కృతికి అద్దంపట్లే బతుకమ్మ పండుగను ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ఘనంగా నిర్వహించారు. ‘బ్రిస్బేన్‌ తెలంగాణ అసోసియేషన్‌’ ఆధ్వర్యంలో స్థానిక స్ట్రాత్‌పైన్‌ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున ప్రవాస తెలంగాణ వాసులు, ప్రవాస భారతీయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బతుకమ్మ ఏర్పాటు చేసి మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా ఆడిపాడి సందడి చేశారు. చిన్నారులంతా సంప్రదాయ వస్త్రధారణలో ఆకట్టుకున్నారు. బతుకమ్మ వేడుకల్లో తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం పట్ల అసోసియేషన్‌ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని