WETA ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు..ప్రత్యేక ఆకర్షణగా ఉదయభాను

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన ‘బతుకమ్మ’ ఉత్సవాలు అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో ఘనంగా ...

Updated : 27 Sep 2022 10:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన ‘బతుకమ్మ’ ఉత్సవాలు అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు. వర్జీనీయాలోని ఫెయిర్‌ఫాక్స్‌ నగరంలో ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ తెలుగు అసోసియేషన్‌ (WETA) ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరిగాయి. స్థానికంగా ఉన్న ఎస్వీ లోటస్‌ టెంపుల్‌ ఆవరణలో ఉత్సవాలను నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పూలతో బతుకమ్మ పేర్చి.. పసుపు ముద్దతో గౌరమ్మను అలంకరించారు. సంప్రదాయ వస్త్రధారణలో మహిళలు ఉత్సాహంగా వేడుకల్లో పాలుపంచుకున్నారు. ప్రముఖ టీవీ యాంకర్‌ ఉదయభాను పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రకృతి మురిసిపోయేట్టు తీరొక్క పూలతో మహిళలు బతుకమ్మను పేర్చారు. ‘‘ఒక్కొక్క పువ్వేసి చందమామా.. ఒక్క జాము గడిచె చందమామా", ‘‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. మాతల్లి బతుకమ్మ ఉయ్యాలో’’ అంటూ జానపద గేయాలు ఆలపించారు. ఆడిపాడుతూ బతుకమ్మ చుట్టూ తిరిగి సందడి చేశారు. యాంకర్‌ ఉదయభాను సైతం ఆడి పాడారు.

WETA స్థాపించినప్పటి నుంచీ ఏటా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది బతుకమ్మ సంబరాల్లో పిల్లలు, పెద్దలంతా కలిసి సుమారు 800 మంది వరకు పాల్గొన్నట్లు నిర్వహకులు తెలిపారు. బతుకమ్మ సంబరాలను వర్జీనియా బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ జయశ్రీ తెలుకుంట్ల, మేరీల్యాండ్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ ప్రీతి రెడ్డి, రీజినల్‌ కల్చరల్‌ ఛైర్ చైతన్య పోలోజు, రీజినల్‌ కోర్‌ కమిటీ స్మృతిరెడ్డి పర్యవేక్షణలో నిర్వహించినట్లు చెప్పారు. వీరితో పాటు సతీశ్‌ వడ్డే, సుధ పాలడుగు, సతీశ్‌ వేమన, విశ్వేశ్వర్‌ కలవాల తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన వారికి WETA ప్రెసిడెంట్‌ ఝాన్సీ హనుమాండ్ల, అడ్వైజరీ కౌన్సిల్‌ కో-ఛైర్‌ డాక్టర్‌ అభితేజ కొండా, ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ శైలజ కల్లూరి, నేషనల్‌ మీడియా ఛైర్‌ సుగుణరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు