‘మైట’ ఆధ్వర్యంలో ధూమ్‌ధామ్‌గా బతుకమ్మ సంబరాలు

విదేశాల్లో తెలుగువారు బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మలేషియా తెలంగాణ అసోసియేషన్(మైట) ఆధ్వర్యంలో పూలపండుగ అంగరంగ వైభవంగా జరిగింది.

Published : 06 Oct 2022 15:22 IST

మలేషియా: విదేశాల్లో తెలుగువారు బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మలేషియా తెలంగాణ అసోసియేషన్(మైట) ఆధ్వర్యంలో పూలపండుగ అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిదర్శనమైన ఈ బతుకమ్మ పండుగను రెండు సంవత్సరాల తరువాత ఘనంగా నిర్వహించడంతో ప్రవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కౌలాలంపూర్‌లోని డీచక్రరూఫ్‌ టాప్‌ హాల్, టీఎల్‌కే కాంప్లెక్స్, బ్రిక్‌ఫీల్డ్‌ కౌలాలంపూర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో తెలుగువారు హాజరై సందడి చేశారు.

ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా తెరాస శాసనసభ సభ్యుడు  కిషోర్‌కుమార్‌, భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు, సూర్యాపేట జిల్ల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ గుజ్జ దీపికా యుగంధర్‌, ఇండియన్‌ హైకమిషన్‌ సెక్రటరీ సుష్మ, మలేషియా తెరాస వింగ్‌ ప్రెసిడెంట్‌ చిట్టిబాబు సహా పలువురు తెలంగాణ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాట్లాడుతూ.. ఏటా బతుకమ్మ సంబంరాలను నిర్వహిస్తున్న మలేషియా తెలంగాణ అసోసియేషన్‌ను అభినందించారు. విదేశాల్లో ఉంటున్నా, మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతున్న తెలంగాణ ఆడపడుచులను మెచ్చుకున్నారు. మలేషియా వచ్చి ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారికి, ప్రమాదవశాత్తూ మరణించిన వారికీ ‘మైట’ తరపున సహాయ సహకారాలు అందజేస్తున్న మైట కోర్ కమిటీ సభ్యులను అభినందించారు.
అనంతరం గాదరి కిషోర్‌కుమార్‌ మాట్లాడుతూ.. మైట చేస్తున్న సేవాకార్యక్రమాలు అభినందిస్తూ అలాగే తెలంగాణ వారికి ఏ సమస్య వచ్చినా మైట, తెలంగాణ ప్రభుత్వం వారిని ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చారు.

మైట ప్రెసిడెంట్‌ తిరుపతి మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ ప్రత్యేకతను ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి సహాయం చేసిన ఏవౌస్, జెన్‌ టెక్‌, లావు టెక్సోలుషన్స్, అక్యూమెంట్ ఇన్ఫోటెక్, ఆలివ్‌ టెక్నాలజీస్ , తెరాస మలేషియా, మలబార్‌ గోల్డ్‌, కేవీటీ గోల్డ్‌, జాస్డేకొరేటర్స్‌, మినీమార్ట్ అప్, ట్రూఫ్రెషిస్, శ్రీబిర్యానీ.com రెస్టారెంట్, మై81 రెస్టారెంట్, బిగ్‌సి రెస్టారెంట్, ప్రబలీ రెస్టారెంట్, ఫామిలీ గార్డెన్ రెస్టారెంట్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో అధ్యక్షుడు తిరుపతి, ఉపాధ్యక్షులు చొప్పరి సత్య, మోహన్‌రెడ్డి, నరేంద్రనాథ్, జనరల్‌ సెక్రటరీ, రవిచంద్ర, జాయింట్‌ సెక్రటరీ సందీప్, ట్రెజరర్‌ రవీందర్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ వర్మ, కృష్ణవర్మ, వివేక్, రాములు, సుందర్, కృష్ణారెడ్డి, ఉమెన్స్‌ వింగ్‌ ప్రెసిడెంట్‌, కిరణ్మయి, వైస్‌ ప్రెసిడెంట్‌ స్వప్న, అశ్విత, యూత్‌ వింగ్‌ ప్రెసిడెంట్‌, కిరణ్‌గౌడ్‌, రవితేజ, కల్చరల్‌ మెంబర్స్‌ చందు, రామకృష్ణ, నరేందర్, రంజిత్, సంతోష్, అనూష, దివ్య, సాహితి, సాయిచరణి, ఇందు, రోజా, శ్రీలతతో పాటు, మధు, శ్రీనివాస్, రఘునాథ్, సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని