Canada: టొరంటోలో ఘనంగా బతుకమ్మ, దసరా సంబరాలు

తెలంగాణ కెనడా అసోసియేషన్‌ (TCA) ఆధ్వర్యంలో టొరంటో నగరంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. 

Published : 30 Oct 2023 17:50 IST

టొరంటో: తెలంగాణ కెనడా అసోసియేషన్‌ (TCA) ఆధ్వర్యంలో టొరంటో నగరంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. మిస్సిసాగాలోని ఆనాపిలిస్‌ హాల్‌లో జరిగిన ఈ వేడుకల్లో 3500కుపైగా తెలంగాణ ప్రవాసులు పాల్గొన్నారు. శిల్పా చందా, శ్రీదేవి కల్లేపల్లి, సమత కాకర్ల, వైదేహి భగత్, అన్నపూర్ణ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి బతుకమ్మ సంబరాలను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఈవెంట్ స్పాన్సర్‌గా వ్యవహరించిన గెట్‌ హోమ్‌ రియల్టీ వారిని టీసీఏ అధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం అభినందించి, శాలువాతో సత్కరించారు. మహిళలు 95 బతుకమ్మలు తీసుకొచ్చి బతుకమ్మపై ఉన్న భక్తిని చాటుకున్నారు. పలు వంటకాలతో పాట్‌లాక్‌ విందు భోజనం సమకూర్చారు. ఈ సందర్బంగా టీసీఏ అధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు బతుకమ్మ సంబరాలపై ఆసక్తిని కొనియాడారు. టీసీఏ అధికారిక తెలుగు పత్రిక ‘TCA బతుకమ్మ’ సంచికను విడుదల చేశారు. అత్యుత్తమ బతుకమ్మలను ఎంపిక చేసేందుకు మనశ్విని వేలపాటి, ప్రదీపా వాల న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. విజేతలకు విభూతి ఫ్యాబ్ స్టూడియోస్, టీసీఏ, సండైన్ తెలుగు ఫుడ్స్ వారు బహుమతులను అందజేశారు.

మరోవైపు టీసీఏ ఆధ్వర్యంలో దసరా సంబరాలను కూడా నిర్వహించారు. దుర్గా పూజచేసిన అనంతరం.. పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. తెలంగాణ వంటకాలతో సభ్యులకు విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక మండలి అధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం, ఉపాధ్యక్షుడు మనోజ్ రెడ్డి, కార్యదర్శి శంతన్ నేరళ్లపల్లి, సంయుక్త కార్యదర్శి రాజేష్ అర్ర, సంయుక్త సాంస్కృతిక కార్యదర్శి ప్రహళిక మ్యాకల, కోశాధికారి వేణుగోపాల్ ఏళ్ల, సంయుక్త కోశాధికారి రాహుల్ బాలనేని, డైరెక్టర్లు నాగేశ్వరరావు దలువాయి, ప్రవీణ్ కుమార్ సామల, శంకర్ భరద్వాజ పోపూరి, ధర్మకర్తల మండలి చైర్మన్ నవీన్ ఆకుల, బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ సభ్యురాలు మాధురి చాతరాజు, వ్యవస్థాపక సభ్యులు దేవేందర్ రెడ్డి గుజ్జుల, కోటేశ్వర రావు చిత్తలూరి, ప్రకాష్ చిట్యాల, శ్రీనివాస తిరునగరి, హరి రావుల్, విజయ్ కుమార్ తిరుమలపురం, అఖిలేష్ బెజ్జంకి, ప్రభాకర్ కంబాలపల్లి, సంతోష్ గజవాడ, రాజేశ్వర్ ఈధ, వేణుగోపాల్ రోకండ్ల పాల్గొన్నారు. ఈ వేడుకలను విజయవంతం చేసిన తెలుగు వారందరికీ టీసీఏ అధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం కృతజ్ఞతలు తెలిపారు. ఈ బతుకమ్మ, దసరా వేడుకలు కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 800 మందితో ప్రారంభమయ్యి.. నేడు 3500 మందికి పైగా తెలంగాణ కుటుంబాలు ఒకచోట కలుసుకునేలా చేశాయని, ఇదెంతో సంతోషంగా ఉందని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని