Batukamma: హాంగ్‌కాంగ్‌లో వైభవంగా బతుకమ్మ సంబురాలు

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు నిర్వహించే శరన్నవరాత్రులు, బతుకమ్మ పండుగను హాంగ్‌కాంగ్‌లో ఘనంగా నిర్వహించారు. సద్దుల బతుకమ్మ రోజున ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఆడపడుచులంతా, కరోనా నిబంధనలను పాటిస్తూ ఉత్సహాంగా ఆడిపారని సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు జయపీసపాటి తెలిపారు.

Published : 05 Oct 2022 17:59 IST

హాంగ్‌కాంగ్‌: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు నిర్వహించే శరన్నవరాత్రులు, బతుకమ్మ పండుగను హాంగ్‌కాంగ్‌లో ఘనంగా నిర్వహించారు. సద్దుల బతుకమ్మ రోజున ‘ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య’ ఆడపడుచులంతా, కరోనా నిబంధనలను పాటిస్తూ ఉత్సహాంగా ఆడిపారని సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు జయపీసపాటి తెలిపారు. సమాఖ్య మహిళా విభాగం "సఖియా" సంయుక్త కార్యదర్శి కొండ నాగ మాధురి, అశ్విని రెడ్డి, సాంస్కృతిక కార్యదర్శి రమాదేవి సారంగా, హర్షిణీ పచ్ఛంటి అద్భుతంగా కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ బతుకమ్మ, విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

శరన్నవరాత్రుల్లో  ఉదయం, సాయంత్రం లలిత పారాయణం చేశారు. దీనికోసం ప్రత్యేకంగా హాంగ్‌కాంగ్‌ లాంటావా ద్వీపంలోని తుంగచుక్‌ వాసులు ‘లలిత సహస్రనామం చాంటింగ్‌ గ్రూప్‌’ ప్రారంభించారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారు ఏ రోజు ఏ రూపంలో దర్శనమిస్తారు? ఏ రంగు అమ్మవారికి ఇష్టం? ఎలాంటి నైవేద్యం పెట్టాలి తదితర వివరాలతో ఒక పట్టికను తయారు చేశారు. ఆ ప్రకారంగా వారు ప్రతి ఇంటా ఘనంగా అమ్మవారిని అందంగా అలంకరించి, మనసారా కొలిచి, అమ్మకు ప్రీతికరమైన నైవేద్యాలు సమర్పించారు. పారాయణానికి వచ్చిన వారు తమ శక్తి కొలది ఒక డొనేషన్ బాక్స్‌లో వేస్తారు. నవరాత్రులు పూర్తయ్యాక ఆ డబ్బులని భారత్‌లోని దక్షిణ రాష్ట్రాలలోని ఏవైనా ఒకట్రెండు వృద్ధాశ్రమాలకు, అనాథ పిల్లలకి విరాళంగా ఇస్తారు. ఈ గ్రూప్‌ను ప్రారంభించిన సంధ్య గోపాల్ మాట్లాడుతూ ఇలా తామంతా మానవ సేవ చేస్తున్నందుకు ఎంతో తృప్తిగా ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని