బే ఏరియాలో ‘తెదేపా-జనసేన-భాజపా’కు చెందిన ఎన్‌ఆర్‌ఐల ఆత్మీయ సమావేశం

అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో స్థిరపడిన ఎన్‌ఆర్‌ఐలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

Published : 11 Mar 2024 14:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో స్థిరపడిన ఎన్‌ఆర్‌ఐలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ‘సేవ్‌ ఆంధ్రా’ నినాదంతో ఏర్పాటు చేసిన ఈ మీటింగ్‌లో తెదేపా, జనసేన, భాజపాకు చెందిన నేతలు, అభిమానులు పాల్గొన్నారు. రానున్న ఏపీ ఎన్నికల్లో తెదేపా కూటమి విజయానికి అందించే సహాయ సహకారాలపై ఈ సమావేశంలో చర్చించారు.  

ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ జగన్‌ పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా అధోగతి పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర పరిస్థితి చూస్తే జాలేస్తోందని.. ఉమ్మడి ఏపీ ఏర్పాటైనప్పటి నుంచి ఇలాంటి తిరోగమనం ఎప్పుడూ చూడలేదన్నారు. రానున్న నెలరోజులు కీలకమైనవని.. వీలైనంత వరకు క్షేత్రస్థాయిలో పనిచేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కోరారు. కుదరని వాళ్లు ఇక్కడి నుంచే మద్దతు తెలపాలన్నారు. తమ వంతు ఆర్థికసాయాన్ని తెదేపా కూటమికి అందించాలని తీర్మానించుకున్నట్లు నేతలు తెలిపారు. 

ఈ సమావేశంలో తెదేపాకు చెందిన జయరాం కోమటి, శ్రీనివాస్‌ దేవల్ల, వెంకట్‌ కోగంటి, సత్య పోలవరపు, హరి సన్నిధితో పాటు జనసేనకు చెందిన వేణు అనుగంటి, తులసీరాం రావూరి, రామ్‌ చుండూరి, శ్రీనివాస్‌ చిమట, రెడ్డయ్య ప్రత్తిపాటి, అనిల్‌ అరిగే, సునీల్‌ పసుపులేటి, దుర్గ పెద్దిరెడ్డి, శంకర్‌ అడాబా, చంద్ర పట్టివాడు, సత్య పుట్ట, నారాయణ మట్టిగంట, రమేశ్‌ రాగినేని, కిశోర్‌కుమార్‌, నిరంజన్‌, రమణ అనుగంటి తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని