Chandrababu: కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు.   

Updated : 22 Apr 2024 23:10 IST

కాలిఫోర్నియా: తెదేపా అధినేత అధినేత నారా చంద్రబాబు నాయుడు 74వ జన్మదిన వేడుకలను అమెరికాలోని బే ఏరియాలో ఉన్న శాన్ రామన్ స్పోర్ట్స్ పార్క్‌లో ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని తెదేపా కూటమి ఘన విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. ‘NRI TDP’ ‘Happy Birthday CBN’ అనే సందేశాన్ని కలిగి ఉన్న బ్యానర్‌లను, గొడుగులను ప్రదర్శించారు. మహిళలు పసుపు చీరలను ధరించి ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా విస్తృత అనుభవం దృష్ట్యా, వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల కోసం తెదేపా ప్రచారానికి ఆయన నాయకత్వాన్ని హైలైట్ చేస్తూ, తెదేపా, జనసేన, భాజపా కూటమికి మద్దతు ఇవ్వాలని ఓటర్లను కోరారు. జన్మదిన వేడుకల్లో ఎన్నారై తెదేపా నాయకులు చిన్నారులతో కలిసి చంద్రబాబు పుట్టినరోజు కేక్‌ను కట్ చేశారు. చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా నాయకులు, ఐటీ నిపుణులు, సీనియర్ సిటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

తెదేపా ఎన్నారై నేతలు సురేష్ పోతినేని, శ్రీనివాస్ శాఖమూరి, సతీష్ వేమూరి, రజని కాకర్ల, రామ్ మద్దినేని, సత్యనారాయణ ఆలపాటి, ఆదినారాయణ, రామ్ ప్రసాద్ చోడె, రామ్ బైరపనేని, చెన్న క్రిష్ణయ్య, నరేష్ జంపని, శ్రీనివాస్ మైనేని, బాలకృష్ణ కంతేటి, నరహరి మర్నేని, హరిబాబు బొప్పుడి తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా నాయకుడు ఎంవీ రావు ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు