Waltair Veerayya: బే ఏరియాలో మెగా అభిమానుల సందడి
అమెరికాలోని బే ఏరియాలో మెగా అభిమానులు సందడి చేశారు. చిరు (Chiranjeevi) నటించిన ‘వాల్తేరు వీరయ్య’ (waltair Veerayya) సినిమా రిలీజ్‌ను పురస్కరించుకుని థియేటర్ వద్ద సెలబ్రేషన్స్ జరిపారు.
ఇంటర్నెట్‌డెస్క్: ‘వీర సింహారెడ్డి’ (Veera Simha Reddy), ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) చిత్రాలతో తెలుగువారికి సంక్రాంతి పండుగ రెండు రోజులు ముందు నుంచే మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లోనూ తమ హీరో చిత్రాన్ని చూసేందుకు అభిమానులు థియేటర్ల వద్ద బారులు తీరుతున్నారు. చిరంజీవి (Chiranjeevi) నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్‌ను పురస్కరించుకుని అమెరికాలోని బే ఏరియాలో సందడి వాతావరణం నెలకొంది. CineMax 4K థియేటర్ వద్ద మెగా అభిమానులు సందడి చేశారు. చిరు కటౌట్లకు పాలాభిషేకాలు చేశారు. మెగా అభిమానులు వీరబాబు ప్రత్తిపాటి, మురళి గొడవర్తి, రమణ్ సంచుల, శివ మొలబంతి, రెడ్డయ్య ప్రత్తిపాటి, కిరణ్ ఎనుగుంతల, అనిల్ అరిగె, సునీల్ పసుపులేటి, కిరణ్ విన్నకోట, దుర్గా పెద్దిరెడ్డి, చరణ్ కనపర్తి, రాజా సింహాద్రి, మూర్తి పిట్టా, సత్య యలమంచిలి ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరిగాయి. CineMax 4K మేనేజింగ్ పార్ట్నర్ మోహన్ సుగ్గల ఈ కార్యక్రమానికి విచ్చేసిన మెగా అభిమానులకు అభినందనలు తెలియజేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30/01/2023)
-
World News
ఐదు నెలలుగా విమానాశ్రయంలోనే.. రష్యన్ పౌరుల ‘ది టెర్మినల్’ స్టోరీ!
-
India News
Vande Bharat Express: వందే భారత్ రైళ్లలో క్లీనింగ్ ప్రక్రియ మార్పు.. ఇకపై అలా చేయొద్దు ప్లీజ్!
-
Sports News
Virat - Rohit: విరాట్, రోహిత్.. టీ20ల్లో వీరిద్దరిలో ఒక్కరినైనా ఆడించాలి: పాక్ దిగ్గజం
-
Movies News
Pooja Hegde: సోదరుడి వివాహం.. పూజా హెగ్డే భావోద్వేగం!
-
General News
Sajjanar: అలాంటి సంస్థలకు ప్రచారం చేయొద్దు: సెలబ్రిటీలకు సజ్జనార్ సలహా