అమెరికాలో సీఎన్ఎన్ హీరోగా తెలుగు విద్యార్థి శ్రీ నిహాల్‌కు అరుదైన గౌరవం

ప్రవాస తెలుగు విద్యార్థి శ్రీ నిహాల్‌కు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. ఈ కుర్రాడు చేసిన సేవలకు మెచ్చిన ప్రముఖ ఛానల్‌ సీఎన్‌ఎన్‌ హీరోస్‌ కార్యక్రమంలో అతడిని ఘన సత్కారం లభించింది. 

Published : 22 Jan 2023 16:08 IST

న్యూజెర్సీ‌: అమెరికాలో ప్రవాస తెలుగు విద్యార్ధికి శ్రీ నిహల్ తమ్మనకు అరుదైన గౌరవం లభించింది. అమెరికన్ టెలివిజన్ ఛానల్‌ సీఎన్ఎన్ హీరోస్ కార్యక్రమంలో శ్రీ నిహాల్‌ను స్టూడియోకి పిలిచి సత్కరించింది. శ్రీనిహాల్ రియల్ హీరో అని ప్రశంసించింది. ఇంతకీ శ్రీ నిహాల్  13 ఏళ్ల వయస్సులోనే సమాజ శ్రేయస్సు కోసం.. పర్యావరణ మేలు కోసం వినూత్నంగా ఆలోచించాడు. తనకు వచ్చిన ఆలోచనకు కార్యరూపం ఇచ్చాడు. అందరూ వాడి పడేస్తున్న బ్యాటరీలను సేకరించి వాటిని రీ సైక్లింగ్ చేసే ప్రక్రియను చేపట్టాడు. మనం ఇళ్లలో వాడే బ్యాటరీలను చెత్తలో పడేయటం వల్ల అవి పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తున్నాయి. ప్రజల ఆరోగ్యంపై  కూడా ఇవి దుష్ప్రభావం చూపిస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు శ్రీ నిహాల్‌ బ్యాటరీ రీ సైక్లింగ్ కోసం తన వంతు కృషి చేశారు. బ్యాటరీల వల్ల వచ్చే అనర్థాలను, ప్రమాదాలపై అవగాహన కల్పించి.. పనికిరాని బ్యాటరీలను, కాలం చెల్లిన బ్యాటరీలను సేకరించే పనికి శ్రీకారం చుట్టాడు. వాటిని తిరిగి రీసైక్లింగ్ సెంటర్స్‌కు పంపాడు. ఈ కుర్రాడు చేసిన కృషిని గుర్తించిన సీఎన్ఎన్ ఛానల్ అతడిని సన్మానించింది. సమాజంలో మార్పులు కోసం శ్రమించే.. సమస్యలకు పరిష్కారాలు వెతికే రియల్ హీరోస్‌ను సీఎన్ఎన్ హీరోస్‌ పేరుతో సత్కరిస్తుంటుంది. ఈ నేపథ్యంలో శ్రీ నిహల్ రియల్ హీరో అని సీఎన్ఎన్ ప్రశంసించింది. అతడిని సత్కరించింది. ప్రస్తుతం శ్రీ నిహాల్‌ న్యూజెర్సీలో ఉంటున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని