కాన్సాస్‌లో TAGKC ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి వేడుకలు

అమెరికాలోని కాన్సాస్‌ సిటీలో ఇటీవల దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ కాన్సాస్‌ సిటీ (టీఏజీకేసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో సుమారు 700 మంది తెలుగువాళ్లు పాల్గొన్నారు.

Updated : 24 Nov 2022 14:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాలోని కాన్సాస్‌ సిటీలో ఇటీవల దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ కాన్సాస్‌ సిటీ (టీఏజీకేసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో సుమారు 700 మంది తెలుగువాళ్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విశేషు రేపల్లె, శ్రావణి మేక వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా కూచిపూడి, భరతనాట్యంతో పాటు జానపద, శాస్త్రీల నృత్య ప్రదర్శనలు అలరించాయి. సినిమా పాటలకు చిన్నారులు చేసిన డ్యాన్సులు ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపాయి. అభిజ్ఞ వడ్డిపర్తి తన పాటలతో అందరినీ అలరించారు.

కాన్సాస్‌ నగరంలో సామాజిక సేవతో పాటు టేఏజీకేసీకి సేవలు అందించిన శ్రీధర్‌ కొడాలి, శ్రీనివాస్ పెనుగొండ, శ్రీనివాస్‌రెడ్డి చేవూరు, శరత్‌ టేకులపల్లి, శ్రీధర్‌ అమిరెడ్డిలను టీఏజేకేసీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ప్రెసిడెంట్‌, ట్రస్ట్‌ బోర్డు ఛైర్‌, కార్యవర్గం సత్కరించింది. టీఏజేకేసీ అధ్యక్షుడు వంశీ సువ్వారి, ట్రస్ట్‌ ఛైర్‌ దుర్గా తెల్ల గార్లను జ్ఞాపికలతో సన్మానించారు. అనంతరం రాఫెల్స్‌లో గెలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. సుమారు 35 మంది పాల్గొన్న ఫ్యాషన్‌ షో, పెద్దవాళ్లు చేసిన ‘కాన్సాస్‌ కిష్కిందకాండ’ హాస్య నాటిక ఈ కార్యక్రమానికి హైలైట్‌గా నిలిచాయి. అనంతరం టీఏజేకేసీ ఉపాధ్యక్షుడు నరేంద్ర దుదెళ్ల ఓట్‌ ఆఫ్‌ థాంక్స్‌, జనగణమన గేయాలాపనతో ఈ కార్యక్రమాన్ని ముగించారు. ఆ తర్వాత అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు సహకరించిన కార్యకర్తలు, స్పాన్సర్లకి టీఏజీకేసీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ, ట్రస్ట్‌ బోర్డు కృతజ్ఞతలు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని