టొరంటోలో ‘బిర్చ్‌ మౌంట్‌ ఫ్రెండ్‌ గ్రూప్‌’ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు

కెనడాలోని టోరంటోలో బిర్చ్‌ మౌంట్‌ ఫ్రెండ్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Published : 25 Oct 2022 11:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కెనడాలోని టోరంటోలో బిర్చ్‌ మౌంట్‌ ఫ్రెండ్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సుమారు 120 మంది వాలంటీర్లు, 170 మంది కళాకారులు, 1500 మంది అతిథులతో వేడుకలు అంబరాన్నంటాయి. సుమారు 7 గంటల పాటు శాస్త్రీయ నృత్యాలతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, ఒడియా భాషల పాటలు, డాన్సులు ఆహూతులను అలరించాయి. 

ఈ వేడుకలకు టొరంటో సిటీ కౌన్సిలర్‌ గేరి క్రాఫోర్డ్‌ దంపతులు ముఖ్యఅతిథిగా హాజరై బిర్చ్‌ మౌంట్‌ ఫ్రెండ్‌ గ్రూప్‌ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌-కెనడా బంధం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. బిర్చ్‌ మౌంట్‌ ఫ్రెండ్‌ గ్రూప్‌ కార్యనిర్వాహక సభ్యులు జగపతి రాయల, సూర్య కొండేటి, ప్రతాప్‌ బొల్లవరం, విష్ణు వంగల, రమేశ్‌ తుంపర, శ్రీకాంత్‌ బండ్లమూడి, రాజశేఖర్‌రెడ్డి, మూర్తి వారణాసి, నరసింహారెడ్డి, సర్దార్‌ ఖాన్‌, రామసుబ్బారెడ్డి తదితరులు ఈ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమం విజయవంతానికి ‘మిషన్‌ ఆఫ్‌ మదర్స్‌’ సహకరించారు. 

ఈ సందర్భంగా ఆర్గనైజర్ జగపతి రాయల మాట్లాడుతూ కెనడా చరిత్రలో ఇది అతిపెద్ద దీపావళి ఈవెంట్‌ అని.. ఇలాంటి మనదైన పండుగలు మరిన్ని నిర్వహించి తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలను కాపాడతామని చెప్పారు. దీనారెడ్డి ముత్తుకూరు, రామ్‌ జిన్నల, శ్రీకాంత్‌ లింగమనేని, ఫణీంద్ర కుమార్‌ కొడాలి, భరత్‌కుమార్‌ రెడ్డి, మినర్వా రెస్టారెంట్‌, హార్ట్‌ఫుల్‌ రిలాక్సేషన్‌ సౌజన్యంతో ఈ వేడుకలు ఘనంగా ముగిశాయి. మరో ఆర్గనైజర్‌ సూర్య కొండేటి మాట్లాడుతూ 120 మంది వాలంటీర్లు రాత్రీపగలు శ్రమించి దీపావళి ఈవెంట్‌ను విజయవంతం చేశారంటూ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం అనంతరం చిన్నారులు, పెద్దలంతా కలిసి బాణసంచా కాల్చి సందడి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని