ఆస్టిన్‌లో ఉత్సాహంగా దసరా-దీపావళి వేడుకలు.. పాటలతో ఉర్రూతలూగించిన సింగర్స్‌

ఆస్టిన్ తెలుగు సాంస్కృతిక సంఘం(TCA) ఆధ్వర్యంలో అమెరికాలోని టెక్సాస్‌లో దసరా, దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆస్టిన్‌ నగరంలో నిర్వహించిన ఈ వేడుకకు దాదాపు 600 మందికి పైగా తెలుగుప్రజలు పాల్గొన్నారు.

Published : 16 Nov 2022 18:46 IST

ఆస్టిన్‌: ఆస్టిన్ తెలుగు సాంస్కృతిక సంఘం(TCA) ఆధ్వర్యంలో అమెరికాలోని టెక్సాస్‌లో దసరా, దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆస్టిన్‌ నగరంలో నిర్వహించిన ఈ వేడుకల్లో దాదాపు 600 మందికి పైగా తెలుగుప్రజలు పాల్గొన్నారు. సంప్రదాయ వస్త్రధారణలో చిన్నా,పెద్దా అంతా కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సినీ గాయకులు గీతా మాధురి, అఖిల మమందుర్‌, ఆదిత్య అయ్యంగార్‌ ఆలపించిన సినిమా పాటలు అందరినీ ఉర్రూతలూగించాయి. ఈ సందర్భంగా తెలుగు సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ రకాల క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ ఈవెంట్‌కు సాహిత్య వింజమూరి యాంకరింగ్‌ చేసి ఆకట్టుకున్నారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగువారందరికీ భోజన సదుపాయాలు కల్పించి సహకరించిన దాతలకు టీసీఏ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్‌ బత్తుల, ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ అర్జున్‌ అనంతుల, కార్యదర్శి శ్రీనివాస్‌ భైరపనేని, కోశాధికారి వెంకట్‌ సాదినేని, స్పోర్ట్స్‌ కమిటీ ఛైర్‌ పరమేశ్వర్‌ రెడ్డి నంగి, ఫైనాన్స్‌ సెక్రటరీ మధుకర్‌, ఫుడ్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ సెక్రటరీ చిన్నపరెడ్డి, మెంబర్‌షిప్‌ సెక్రటరీ భరత్‌ పిస్సాయ్‌, కల్చరల్‌ సెక్రటరీ శైలజ, బోర్డు ఆఫ్‌ డైరెక్టర్స్‌ వెంకటరామిరెడ్డి ఉమ్మ, రామ్‌ హనుమంత్‌ మల్లిరెడ్డి, మురళీధర్‌ రెడ్డి వేలూరు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని