Donald Trump: వివేక్ అంటే నాకిష్టం.. ప్రత్యర్థిపై ట్రంప్ పొగడ్తలు
రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష పదవి రేసులో తనకు ప్రత్యర్థిగా ఉన్న భారత సంతతి నేత వివేక్ రామస్వామి (Vivek Ramaswamy)పై డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రశంసలు కురిపించారు. ఆయనంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న భారత సంతతి నేత వివేక్ రామస్వామి (Vivek Ramaswamy)పై అగ్రరాజ్య మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రశంసలు కురిపించారు. ఆయన చాలా మంచి వ్యక్తి అని, అందుకే ప్రైమరీ ఎన్నికల్లో ఆయనకు మంచి ఆదరణ లభిస్తోందని పొగిడారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థి ఎన్నికల్లో తనకు ప్రత్యర్థి అయిన వివేక్‌ను ట్రంప్ ఇలా ప్రశంసలతో ముంచెత్తడం విశేషం.
రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి ట్రంప్ (Donald Trump)తో పాటు పలువురు పోటీలో ఉన్న విషయం తెలిసిందే. వీరిపై CBS YouGov ఓ పోల్ సర్వే చేపట్టింది. ఇందులో అధ్యక్ష అభ్యర్థి రేసులో అందరికంటే ట్రంప్ ముందంజలో ఉండగా.. ఫ్లోరిడా గవర్నర్ డిశాంటిస్ రెండో స్థానంలో నిలిచారు. అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌తో సమానంగా వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) మూడో స్థానంలో ఉన్నారు. దీనిపై ట్రంప్ సోషల్‌మీడియా వేదికగా స్పందిస్తూ.. వివేక్‌పై ప్రశంసలు కురిపించారు.
‘‘CBS YouGov రిపబ్లికన్ ప్రైమరీ పోల్‌లో వివేక్ రామస్వామికి మంచి ఆదరణ లభించడం ఆనందంగా ఉంది. మైక్ పెన్స్‌తో సమానంగా ఉన్న ఆయన.. త్వరలోనే డిశాంటిస్‌ను దాటే అవకాశాలు కన్పిస్తున్నాయి. వివేక్ అంటే నాకు చాలా ఇష్టం. నేను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నా గురించి, నా ప్రభుత్వం గురించి ఆయన ఎప్పుడూ మంచిగా మాట్లాడేవారు. అందువల్లే ఇప్పుడు ఆయన ప్రైమరీ పోల్‌లో ప్రజల నుంచి ఆదరణ పొందుతున్నారు. ఆయనకు అంతా మంచే జరగాలి’’ అని ట్రంప్ (Donald Trump) రాసుకొచ్చారు.
అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్నట్లు వివేక్ రామస్వామి ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే. ‘‘ఇది రాజకీయ ప్రచారం మాత్రమే కాదు. తర్వాతి తరం అమెరికన్లకు కొత్త కలలను సృష్టించేందుకు చేస్తున్న సాంస్కృతిక ఉద్యమం ఇది’’ అని ఆ సమయంలో ఆయన పేర్కొన్నారు. అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన రెండో భారత సంతతి నేత ఈయన. మరో భారత సంతతి నాయకురాలు నిక్కీ హేలీ కూడా రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. తాజా సర్వేలో వివేక్.. నిక్కీ కంటే ముందంజలో ఉన్నారు.
ఎవరీ వివేక్ రామస్వామి..
వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) ఒహాయోలో ఆగస్టు 9, 1985లో జన్మించారు. ఆయన వయస్సు 37 సంవత్సరాలు. కేరళకు చెందిన ఆయన తల్లిదండ్రులు ఆమెరికా(America)కు వలస వచ్చారు. హార్వర్డ్, యేల్ యూనివర్సిటీల్లో విద్యనభ్యసించారు. లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం.. గత ఏడాది ఆయన స్ట్రైవ్ అసెట్ మేనేజ్‌మెంట్‌ను స్థాపించారు. దీనికి ముందు ఆయనకు ఔషధరంగంలో మంచి పేరు ఉంది. రొవాంట్ సైన్సెస్‌ను ఏర్పాటు చేశారు. 2016లో ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం.. ఆయన ఆస్తుల విలువ 600 మిలియన్ డాలర్లుగా ఉంది. దీంతో 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న సంపన్నుల్లో ఒకరిగా నిలిచారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Mangalagiri: రెండేళ్ల చిన్నారిని నేలకేసి కొట్టి చంపిన తండ్రి
-
Ap-top-news News
ISRO: అక్కడే చదివి.. శాస్త్రవేత్తగా ఎదిగి..ఎన్వీఎస్-01 ప్రాజెక్టు డైరెక్టర్ స్ఫూర్తిగాథ
-
India News
Women safety device: మహిళల రక్షణకు ఎలక్ట్రిక్ చెప్పులు
-
Ts-top-news News
Raghunandan: ఎమ్మెల్యే రఘునందన్‌పై రూ.1000 కోట్లకు పరువునష్టం దావా
-
Sports News
Dhoni: రిటైర్మెంట్పై నిర్ణయానికి ఇది సరైన సమయమే కానీ.. ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
India News
Bus Accident: లోయలో పడిన బస్సు.. ఏడుగురి మృతి