USA: ఎన్టీఆర్‌ శత జయంతి.. ఫ్రిస్కో మేయర్‌ కీలక ప్రకటన

అమెరికాలో తెలుగువారి ఖ్యాతి అంతకంతకు పెరుగుతూనే ఉంది.

Updated : 15 May 2023 11:53 IST


ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాలో తెలుగువారి ఖ్యాతి అంతకంతకు పెరుగుతూనే ఉంది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలను ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘనంగా జరుపుకొంటున్న వేళ.. అమెరికా టెక్సాస్‌లోని ఫ్రిస్కో నగర మేయర్‌ జెఫ్‌ చేనీ ఓ కీలక ప్రకటన చేశారు. తెలుగు ప్రజలంతా అన్నగారిగా భావించే ఎన్టీఆర్ జయంతి (మే 28)నాడు ‘ఫ్రిస్కో సిటీ తెలుగు హెరిటేజ్‌ డే’గా మేయర్‌ ప్రకటించారు. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను తెలుగు ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకొంటున్నందున తమ తరఫున ఆయన గౌరవార్థంగా ఈ నిర్ణయం తీసుకన్నట్లు ఫ్రిస్కో మేయర్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని