
మిస్ ఇండియా వరల్డ్‌గా తెలంగాణ యువతి మానస
ముంబయి: తెలంగాణకు చెందిన యువ ఇంజినీరు మానస వారణాసి బుధవారం రాత్రి ముంబయిలో జరిగిన వీఎల్సీసీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 పోటీల్లో విజేతగా నిలిచారు. హరియాణా యువతి మానిక శికంద్ ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా 2020గా, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మాన్యసింగ్ ఫెమినా మిస్ ఇండియా 2020 రన్నరప్‌గా నిలిచారు. జ్యూరీ సభ్యులుగా బాలీవుడ్ నటులు నేహా ధూపియా, చిత్రాంగద సింగ్, పులకిత్ సమ్రాట్, ప్రముఖ డిజైనర్ ఫల్గుణి వ్యవహరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.