ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ప్రయాణికులకు.. ఈ-బోర్డింగ్
దేశంలో తొలిసారి ఇక్కడే అందుబాటులోకి..
ఈనాడు, హైదరాబాద్: కాగిత రహిత విమానాశ్రయం దిశగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరిన్ని అడుగులు వేస్తోంది. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో వెళ్లే ప్రయాణికులకు తాజాగా ఈ-బోర్డింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక నుంచి దుబాయి తదితర నగరాలకు ఈ ఎయిర్‌లైన్స్ ద్వారా వెళ్లే ప్రయాణికులు కాగిత రహితంగా బోర్డింగ్ తీసుకోనున్నారు. సోమవారం నుంచి ఆ ఎయిర్‌లైన్స్ ఈ విధానాన్ని వినియోగించుకోవడం ప్రారంభించింది. ఇప్పటికే ఇండిగో, గో ఎయిర్ ఎయిర్‌లైన్స్ అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించే వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. దేశంలో ఈ తరహా సదుపాయాన్ని తొలిసారి అందుబాటులోకి తీసుకొచ్చిన విమానాశ్రయంగా హైదరాబాద్ గుర్తింపు పొందింది. వాస్తవానికి 2015 డిసెంబరు నుంచే అన్ని దేశీయ విమాన సర్వీసులకు కాగిత రహితంగా ఈ-బోర్డింగ్ అందిస్తోంది. తాజాగా అంతర్జాతీయ సర్వీసులకు విస్తరించింది. ఈ సందర్భంగా విమానాశ్రయ సీఈవో ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ ప్రయాణికులు ఎలాంటి ఆటంకాలు లేకుండా వేగంగా, సురక్షితంగా ప్రయాణించడానికి ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అత్మనిర్భర్ భారత్, డిజిటల్ ఇండియా స్ఫూర్తితో ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.
ఇవీ ప్రయోజనాలు: ఈ-బోర్డింగ్ ద్వారా ప్రయాణికులు సంప్రదాయ బోర్డింగ్ పాస్ లేదా చరవాణిలోని బోర్డింగ్ పాస్‌ను ఉపయోగించొచ్చు.
* విమానాశ్రయంలో వరుసలో నిలబడక్కర్లేదు. నిరీక్షణ సమయం తగ్గుతుంది.
* తనిఖీ పాయింట్ల వద్ద పాసులను పదేపదే చూపించాల్సిన అవసరం లేదు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
‘లంచం లేదంటే మంచం’.. కర్ణాటక మాజీ మంత్రి వ్యాఖ్యలపై దుమారం!
-
Movies News
Anupama Parameswaran: పబ్లిక్‌లో రాజమౌళి కాళ్లకు నమస్కరించిన అనుపమ
-
Politics News
Telangana News: అక్కడెందుకు సీఎం కేసీఆర్ పర్యటించలేదు?: కోదండరామ్
-
India News
Modi: మిమ్మల్ని కలుసుకోవాలని అప్పుడే అనుకున్నాను..!
-
Crime News
Telangana News: కామారెడ్డిలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 25 మందికి గాయాలు
-
Sports News
Team india: ఆ ఇద్దరిలో ఎవరిని తుదిజట్టులో ఆడిస్తారో.. : మాజీ క్రికెటర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Rishi Sunak: ఆయన నా ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు: రిషి సునాక్
- Offbeat: ఆ విమానంలో జర్నీ కేవలం ఒక్క నిమిషమే.. ధరెంతో తెలుసా..?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (13/08/2022)
- Best catches: విండీస్ ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్.. ఒకే మ్యాచ్‌లో మూడు సంచలన క్యాచ్‌లు!
- Himanta Biswa Sarma: ఆమిర్ ఖాన్.. మీరు మా రాష్ట్రానికి ఆగస్టు 15 తర్వాతే రండి..!
- Ranveer singh: న్యూడ్ ఫొటోషూట్.. రణ్‌వీర్‌సింగ్ ఇంటికి పోలీసులు!
- SCR: చుట్టూ చూడొచ్చు.. చుక్కలూ లెక్కెట్టొచ్చు.. ద.మ.రైల్వేలో తొలి రైలు
- F3: ‘ఎఫ్-3’.. వెంకీ ఎలా ఒప్పుకొన్నాడో ఏంటో: పరుచూరి గోపాలకృష్ణ
- Karthikeya 2 Review: రివ్యూ: కార్తికేయ-2
- Hyderabad: మహిళ చెర నుంచి నా కుమారుడిని కాపాడండి.. హెచ్ఆర్సీని ఆశ్రయించిన తండ్రి