Dating Game Killer: అమెరికా నరరూప రాక్షసుడు కన్నుమూత
మహిళలను పాశవికంగా అత్యాచారం చేస్తాడు. ఆ తర్వాత సుత్తితో చావబాదుతూ రాక్షసానందం పొందుతాడు.
130 మంది మహిళలపై హత్యాచారం చేసినట్లు ఆరోపణలు
మరణశిక్ష ఖరారుతో జైల్లో ఉంటూ మృతి
శాక్రామెంటో: మహిళలను పాశవికంగా అత్యాచారం చేస్తాడు. ఆ తర్వాత సుత్తితో చావబాదుతూ రాక్షసానందం పొందుతాడు. చావుకు, బతుక్కి మధ్య ప్రాణాలు కొట్టుమిట్టాడుతుండగా కాసేపు వదిలేస్తాడు. కాస్త స్పృహలోకి వచ్చాక మళ్లీ ఘోరంగా దాడి చేసి చంపుతాడు. తర్వాత బాధితురాళ్ల చెవి పోగులను తీసుకుని ఇంట్లో దాచుకుంటాడు. ఇలా ఎంతో మంది మహిళలను చిత్రవధ చేసి చంపిన నరరూప రాక్షసుడు, అమెరికాలో ‘ది డేటింగ్ గేమ్ కిల్లర్’గా పేరుపొందిన రోడ్నీ జేమ్స్ అల్కాలా(77) మరణించాడు. మరణశిక్ష కోసం ఎదురుచూస్తూ కాలిఫోర్నియాలోని కొర్కోరన్ జైలులో ఉన్న అల్కాలా సహజ కారణాలతో తుది శ్వాస విడిచినట్లు అధికారులు తెలిపారు. ఏడుగురు మహిళల హత్య కేసుల్లో అతడిపై నేరం రుజువైనా, వాస్తవానికి తన చేతిలో 130 మందికి పైగా హతమై ఉండొచ్చని అధికారులు విశ్వసిస్తున్నారు. 1968లో 8 ఏళ్ల బాలికపై, 1974లో 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసుల్లో జైలు శిక్ష అనుభవించిన అల్కాలా.. 1978లో ‘ది డేటింగ్ గేమ్’ టీవీ షోలో పోటీదారుగా పాల్గొన్నాడు. మహిళలపై అఘాయిత్యానికి పాల్పడే ముందు ఫొటోలు తీసే అలవాటున్న అల్కాలా..
ఆ షోలో తనను ఫొటోగ్రాఫర్‌గా పరిచయం చేసుకున్నాడు. అందులో విజేతగానూ నిలిచాడు. ఈ షోతోనే అతడికి ది డేటింగ్ గేమ్ కిల్లర్ అని పేరొచ్చింది. 1979లో రాబిన్ సామ్సో అనే 12 ఏళ్ల బాలికను హత్య చేసిన కేసులో అల్కాలాకు 1980లో మరణశిక్ష పడింది. కానీ నాలుగేళ్లకు రద్దైంది. 2010లో డీఎన్‌ఏ సాయంతో అతడిపై నేరాన్ని రుజువు చేయడంతో మరణశిక్ష ఖరారైంది. అదే ఏడాది మరో నలుగురు మహిళల హత్య కేసులోనూ మరణశిక్ష పడింది. 2013లో మరో ఇద్దరు మహిళల హత్య కేసు రుజువు కావడంతో 25 ఏళ్ల కారాగార శిక్షను విధించారు. అల్కాలా దాచుకున్న బాధితురాళ్ల చెవిపోగులు అతడి నేరాలను రుజువు చేయడంలో కీలకంగా మారాయి. అతడి ఇంటిలో ఉన్న 100కు పైగా మహిళల ఫొటోలను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. అందులో చాలా మంది ఆచూకీ లభ్యం కాలేదు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
keerthy suresh: కీర్తి సురేశ్ పెళ్లిపై వార్తలు.. క్లారిటీ ఇచ్చిన తండ్రి
-
India News
Shah Rukh Khan: కొత్త పార్లమెంట్‌పై షారుక్ ట్వీట్.. స్పందించిన ప్రధాని మోదీ..!
-
Movies News
Sharwanand: ఎవరికీ గాయాలు కాలేదు.. రోడ్డు ప్రమాదంపై హీరో శర్వానంద్ టీమ్ క్లారిటీ
-
Sports News
Dhoni- Chahar: ధోనీ నుంచి అక్షింతలు పడ్డాయి.. అభినందనలూ వచ్చాయి: దీపక్ చాహర్
-
Politics News
Pawan Kalyan: ఎన్టీఆర్ తెలుగువారి సత్తా దిల్లీకి చాటారు: పవన్
-
India News
New Parliament Building: కొత్త పార్లమెంటు భవనం జాతికి అంకితం