టొరంటోలో ఘనంగా తీన్మార్ సంక్రాంతి వేడుకలు

కెనడాలోని టొరంటోలో  తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో జనవరి 15న ‘తీన్మార్ సంక్రాంతి 2022’

Updated : 16 Jan 2022 15:51 IST

టొరంటో:  కెనడాలోని టొరంటోలో  తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో జనవరి 15న ‘తీన్మార్ సంక్రాంతి 2022’ సాంస్కృతిక వర్చ్యువల్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.  ఈ సంబరాల్లో 200 మందికిపైగా కెనడా తెలంగాణ వాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సహాయ కార్యదర్శి జితేందర్ సతీమణి కాంతి దీప ప్రజ్వలన చేసి ఈ సంబరాలను ప్రారంభించారు. టీసీఏ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఆధ్వర్యంలో.. బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీలు, ఫౌండేషన్‌ కమిటీ సభ్యుల సహకారంతో ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భోగి పళ్లు, పిల్లల సంప్రదాయ వేడుకలు ఆకట్టుకున్నాయి. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించగా.. ఉమా సలాడి, జయ కందివనం న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇండియా కాన్సులేట్‌ జనరల్ అపూర్వ శ్రీవాస్తవ టీసీఏ 2022 క్యాలెండర్‌ ఆవిష్కరించి ముగ్గుల పోటీలను తిలకించారు. టొరంటోలోని తెలుగు వారి కోసం టీసీఏ చేస్తోన్న సేవా కార్యక్రమాలను కొనియాడారు.

కోవిడ్ నిబంధనలు అతిక్రమించకుండా అందరూ సహకరించి కెనడాలో సంక్రాతి సంబరాలను ఘనంగా నిర్వర్తించారు. టొరంటో కెనడా తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్‌ రాజేశ్‌ మాట్లాడుతూ..  ఏ దేశ మేగినా ఎందు కాలిడినా మన భారత సాంప్రదాయాన్ని గర్వంగా చాటాలని,  మన తెలుగు సాంప్రదాయ సంరక్షణలో భాగం కావాలని కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని