టొరంటోలో అంగ రంగ వైభవంగా ఉగాది ఉత్సవాలు

తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో ఏప్రిల్ 2న గ్రేటర్‌ టొరంటో నగరంలోని కెనడా తెలుగు, తెలంగాణ వాసులు ఉగాది పండుగను

Updated : 03 Apr 2022 10:52 IST

        

తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో ఏప్రిల్ 2న గ్రేటర్‌ టొరంటో నగరంలోని కెనడా తెలుగు, తెలంగాణ వాసులు ఉగాది పండుగను ఘనంగా జరుపుకొన్నారు.  ఈ సంబరాలలో దాదాపు 200 మందికిపైగా తెలుగు వారు పాల్గొన్నారు. వైస్ ప్రెసిడెంట్ మన్నెం శ్రీనివాస్ సతీమణి స్వాతి దీప ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షుడు ఈద రాజేశ్వర్ మాట్లాడుతూ.. కెనడా తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో ఉగాది పండగను అత్యంత ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకొంటూ.. మన తెలుగు సంప్రదాయాలను భావితరాలకు అందజేయడం హర్షణీయమన్నారు.

ఈ సంబరాలు తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్గిక్యూటివ్‌ కమిటీ ఆధ్వర్యంలో, బోర్డు ఆఫ్‌ ట్రస్టీస్‌, ఫౌండేషన్‌ కమిటీ  సభ్యుల సహకారంతో జరిగాయి. ‘పిట్స్ బర్గ్’ శ్రీ వెంకటేశ్వర ఆలయం ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ప్రముఖ జ్యోతిషులు ధనాలకోట సురేశ్‌ చంద్ర వర్మ (హైదరాబాద్-ఉప్పల్) శ్రోతలకు పంచాంగ పఠనం చేశారు.

ఈ సందర్బంగా ఉగాది పండుగ విశిష్టత తెలుపుతూ.. చిన్నారులతో ఉగాది పచ్చడి చేయు విధానాన్ని చక్కగా వివరించారు. 20 మందికిపైగా చిన్నారులు ప్రదర్శించిన “గజి బిజీ బడి” నాటకం, ట్రేండింగ్ రీల్స్ సహా మరెన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సుమారు 3 గంటల పాటు వర్చువల్‌గా సభికులని అలరించాయి. ఈ కార్యక్రమాలన్నీ స్థానిక తెలుగు వారు ప్రదర్శించటం విశేషం

తెలంగాణ కెనడా అసోసియేషన్ టెక్నికల్ టీం సభ్యులు వెంకట జితేందర్ చక్క, కుమారి రిషిమా గజవాడ, ఈద శివాని, ఈద వైష్ణవి, తాటి సాయి రామ్ ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వర్చువల్‌ ఈవెంట్‌ను రాహుల్ బాలినేని, మానస ఇనగంటి చక్కగా సమన్వయ పరిచారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ దామోదర్ రెడ్డి, బోర్డ్ అఫ్ ట్రస్టీ అధ్యక్షులు సంతోష్ గజవాడ, కల్చరల్ సెక్రటరీ కవిత తిరుమలాపురం, ట్రెజెరర్ నవీన్ ఆకుల, కార్యవర్గసభ్యులు, బోర్డు అఫ్ ట్రస్టీ సభ్యులతోపాటు వ్యవస్థాపక సభ్యులు శ్రీనివాస్ తిరునగరి, కోటేశ్వర రావు చిత్తలూరి దేవేందర్ రెడ్డి గుజ్జుల, విజయ్ కుమార్ తిరుమలాపురం, హరి రాహుల్,  పభ్రాకర్ కంబాలపల్లి, ప్రకాశ్‌ చిట్యాల పాల్గొన్నారు. శ్రీనివాస్ మన్నెం ఇచ్చిన సందేశం ఏ దేశమేగినా ఎందు కాలెడినా వందన సమర్పణతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని