షికాగోలో ‘ఆలోలాంతరాళాలలో’ కవితా సంపుటి ఆవిష్కరణ

 చిత్రకారుడిగా ప్రపంచ ప్రఖ్యాతి సాధించిన యస్‌.వి.రామారావు తెలుగు జాతికి వన్నె తెచ్చారని మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్‌ అన్నారు.  కవిగా, రచయితగా కూడా గుర్తింపు తెచ్చుకున్న మహోన్నత వ్యక్తి ఆయనని ప్రస్తుతించారు. అమెరికాలోని షికాగో నగరంలో షికాగో తెలుగు సాహితీ

Updated : 28 Jun 2022 06:11 IST

ఈనాడు, అమరావతి:  చిత్రకారుడిగా ప్రపంచ ప్రఖ్యాతి సాధించిన యస్‌.వి.రామారావు తెలుగు జాతికి వన్నె తెచ్చారని మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్‌ అన్నారు. కవిగా, రచయితగా కూడా గుర్తింపు తెచ్చుకున్న మహోన్నత వ్యక్తి ఆయనని ప్రస్తుతించారు. అమెరికాలోని షికాగో నగరంలో షికాగో తెలుగు సాహితీ మిత్రులు, షికాగో తెలుగు సంఘం ఆధ్వర్యంలో జరిగిన సభలో యస్‌.వి.రామారావు రచించిన ‘ఆలోలాంతరాళాలలో’ కవితా సంపుటిని బుద్ధప్రసాద్‌ ఆవిష్కరించి ప్రసంగించారు. తెలుగు వారు తమ జాతిలో జన్మించిన గొప్పవారిని గుర్తించి గౌరవించుకోకపోవడం, ప్రభుత్వాలు కూడా సరైన రీతిలో సత్కరించకపోవడం వల్ల తెలుగుజాతికి తీరని నష్టం జరుగుతోందని అన్నారు. తెలుగు భాషాసంస్కృతుల పట్ల మక్కువతో తమ కవితల ద్వారా రామారావు మాతృ గడ్డ పట్ల గౌరవ ప్రపత్తులు చాటారని కొనియాడారు. షికాగో సాహితీ మిత్రుల సంస్థ అధ్యక్షుడు జయదేవ్‌ మెట్టుపల్లి అధ్యక్షతన జరిగిన సభలో దామరాజు లక్ష్మి, చిమట కమల, మాదిరెడ్డి పద్మ, జంపాల చౌదరి, శ్రీరామ్‌ శొంఠి, రవీంద్ర రెడ్డి, ప్రకాష్‌ తిమ్మాపురం, దాసరి అమరేంద్ర, ప్రముఖ కార్టూనిస్టు శ్రీధర్‌, గౌరిశంకర్‌ తదితరులు ప్రసంగించి రామారావు దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా యస్‌.వి.రామారావు మాట్లాడుతూ తన అభ్యున్నతికి దోహదపడిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. మండలి వెంకట కృష్ణారావుకి తన కవితా సంపుటిని అంకితం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని