టాంజానియాలో బోనాలు

టాంజానియాలోని దార్‌-ఎస్‌-సలాం నగరంలో తెలంగాణ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా బోనాలు జరిగాయి. దాదాపు వెయ్యి మందికి పైగా తెలంగాణ ప్రవాస కుటుంబాల మహిళలు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు.

Updated : 27 Jul 2022 06:12 IST

తెలంగాణ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహణ

ఈనాడు, హైదరాబాద్‌ : టాంజానియాలోని దార్‌-ఎస్‌-సలాం నగరంలో తెలంగాణ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా బోనాలు జరిగాయి. దాదాపు వెయ్యి మందికి పైగా తెలంగాణ ప్రవాస కుటుంబాల మహిళలు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కును చెల్లించుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసేందుకు ఏటా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలంగాణ సాంస్కృతిక సంఘం సలహాదారు వంగ నరసింహారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. సంతోష్‌రెడ్డి, సురేందర్‌, మోహన్‌రెడ్డి, మధురెడ్డి, చారి, ఆశ్రిత్‌ సైదులు, కుశల్‌, ప్రణీత్‌ రెడ్డి, వెంకటేశ్‌, రాజేశ్‌, సురేశ్‌, రాజు కనిష్క్‌, శేషు, సుమీధ్‌ తదితరులు ఉత్సవాల్లో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని