వాషింగ్టన్‌లో ప్రవాసాంధ్రుల స్వాతంత్య్ర సంబరాలు

గ్రేటర్‌ వాషింగ్టన్‌ తెలుగు సాంస్కృతిక సంఘం (జీడబ్ల్యూటీసీఎస్‌) ఆధ్వర్యంలో అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల

Updated : 16 Aug 2022 06:45 IST

వాషింగ్టన్‌: గ్రేటర్‌ వాషింగ్టన్‌ తెలుగు సాంస్కృతిక సంఘం (జీడబ్ల్యూటీసీఎస్‌) ఆధ్వర్యంలో అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ.. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలను అమెరికాలోనూ నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. అనంతరం జాతీయ జెండా ఎగురవేసి ప్రదర్శన నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీల్లో ప్రవాసాంధ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జీడబ్ల్యూటీసీఎస్‌ అధ్యక్షురాలు సాయిసుధ పాలడుగు, తానా మాజీ అధ్యక్షుడు సతీశ్‌ వేమన, గుంటూరు మిర్చి యార్డు మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు, భారత రాయబార కార్యాలయ కౌన్సిలర్‌ అన్షుల్‌ శర్మ, భాను మాగులూరి పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని