కాలిఫోర్నియా హ్యాంఫోర్డ్‌లో ఘనంగా WETA బతుకమ్మ వేడుకలు

తెలంగాణలో ఊరూవాడా పూలజాతర సందడి చేస్తున్నట్టే అమెరికాలోనూ విమెన్ ఎంపవర్‌మెంట్‌ తెలుగు అసోసియేషన్‌ (WETA) సంస్థ ఆధ్వర్యంలో......

Published : 27 Sep 2022 21:44 IST

కాలిఫోర్నియా: తెలంగాణలో ఊరూవాడా పూలజాతర సందడి చేస్తున్నట్టే అమెరికాలోనూ విమెన్ ఎంపవర్‌మెంట్‌ తెలుగు అసోసియేషన్‌ (WETA) సంస్థ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు జరుపుకొంటున్నారు. కాలిఫోర్నియాలోని హ్యాంఫోర్డ్‌ నగరంలో ప్రకృతి మురిసిపోయేట్టు రంగురంగుల పూలను పేర్చి బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. WETA ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి హనుమాండ్ల బంగ్లా ఆవరణలో బతుకమ్మ పండుగ శోభ సంతరించుకుంది. తీరొక్క పూలతో బతుకమ్మని పేర్చి, పసుపు ముద్దతో గౌరమ్మని అలంకరించుకుని  ‘‘ఒక్కొక్క పువ్వేసి చందమామా.. ఒక్క జాము గడిచె చందమామా’’,  ‘‘బతుకమ్మ బతుకమ్మ ఊయ్యాలో మాతల్లి బతుకమ్మ ఊయ్యాలో..’’ అంటూ జానపద పాటలు పాడుతూ ఈ పూల పండుగను వైభవంగా జరిపారు. మహిళలంతా సంప్రదాయ వస్త్రాధారణతో తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి తీసుకొచ్చారు. అందరూ కలిసి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడిపాడి సందడి చేశారు. 

‘ఉమెన్ ఎంపవర్‌మెంట్‌ తెలుగు అసోసియేషన్ (వేటా)’  స్థాపించినప్పటినుంచి ఏటా బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 500 మంది పెద్దలు, పిల్లలు తరలి వచ్చి సందడి చేశారు. WETA ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి హనుమాండ్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఫుడ్‌ స్పాన్సర్‌ చేసిన కాంతం, సుజాత గాదెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో WETA ట్రజరర్‌ విశ్వ వేమిరెడ్డి, కమ్యూనిటీ చైర్ జ్యోతి, ఆర్‌వీపీ పూజా రెడ్డి, సెక్రటరీ అనురాధ అలిశెట్టి, హైమ అనుమాండ్లతో పాటు దాదాపు 500 మంది పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని