కెనడాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

కెనడాలోని క్యాల్గరి నగరంలో అక్టోబరు 1వ తేదీన క్యాల్గరి తెలంగాణ అసోసియేషన్‌ (సీటీఏ) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.

Published : 07 Oct 2022 10:23 IST

క్యాల్గరి: కెనడాలోని క్యాల్గరి నగరంలో అక్టోబరు 1వ తేదీన క్యాల్గరి తెలంగాణ అసోసియేషన్‌ (సీటీఏ) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో 350 మంది కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వంద మంది మహిళలు కలిసి ఒకేచోట బతుకమ్మ ఆడిపాడారు. ఎంఎల్‌ఏ లీలా అహీర్ ముఖ్య అతిథిగా విచ్చేసి తెలంగాణ మహిళలతో కలసి బతుకమ్మ ఆడి సందడిగా గడిపారు. రకరకాల వాయిద్యాలు వాయిస్తూ పిల్లలు పాటలు పాడుతూ ఎంతో ఉత్సాహంగా గడిపారు. అనంతరం వివిధ రకాల  వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు.

బతుకమ్మ వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన సీటీఏ కమిటీ సభ్యులు సత్యనారాయణ కొంపల్లి, అశ్విన్ తుములు, సుఖేష్ భవండ్ల, శ్రీఖర్ జోషి, నవీన్ లచ్చపెట, హేమలత తోటకూర నెల రోజుల పాటు శ్రమించినారు. ఈ కార్యక్రమానికి హర్షిణి చల్లా, కృష్ణా ఎర్రం వాఖ్యాతలుగా వ్యవహరించారు. సునీల్ రాజవరం, సుభాష్ తాటిపల్లి, వరున్ కటుకొజ్వల, స్వాగత్ వలబోజు, మదన్ చిలువేరి, సందీప్ దరిపల్లి, అభిషేక్, రాహుల్ దండే, సంపత్ పెరుక, శ్యాం ఆనబత్తుల, అనంత్ మంగు, రేష్మా భవండ్ల, స్వాతి తుములు వాలంటీర్లుగా వ్యవహరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు