15న మేరీల్యాండ్‌లో తెదేపా 6వ మహానాడు

అధికార, అభివృద్ధి వికేంద్రీకరణకు ఆధ్యుడు ఎన్టీఆర్‌ అని ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కోఆర్డినేటర్‌ జయరాం కోమటి అన్నారు.

Published : 11 Oct 2022 22:32 IST

మేరీల్యాండ్‌: అధికార, అభివృద్ధి వికేంద్రీకరణకు ఆధ్యుడు ఎన్టీఆర్‌ అని ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కోఆర్డినేటర్‌ జయరాం కోమటి అన్నారు. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఈనెల 15న  కోమటి జయరాం అధ్యక్షతన ఎన్‌ఆర్‌ఐ టీడీపీ మేరీల్యాండ్‌ విభాగం ఆధ్వర్యంలో 6వ మహానాడు జరుగుతుందని తెలిపారు. మేరీ ల్యాండ్‌లో ఉన్న తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ ఉత్సాహంతో ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు విజయవంతం చేసేందుకు సమష్టిగా కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌, మిర్చియార్డ్‌ మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొంటారని చెప్పారు. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని, హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. అమరావతి రైతుల పాదయాత్ర, క్షీణిస్తున్న శాంతిభద్రతలు- ఆగని వేధింపులు, అక్రమ అరెస్టులు, సభ్యత్వ నమోద, పార్టీ సంస్థాగత నిర్మాణంపై తీర్మానాలు ఉంటాయని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు