కిలిమంజారోపై తానా లోగో

ప్రవాస భారతీయుడు, ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) బోర్డు ఆఫ్‌ డైరెక్టర్‌ జనార్దన్‌ నిమ్మలపూడి(జానీ) 5895 మీటర్ల ఎత్తున్న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి తానా లోగోను ప్రదర్శించారు. మధుమేహం, భుజం ఆర్థరైటిస్‌ సమస్యలతో బాధపడుతూనే 50 ఏళ్ల వయసులో యాత్రను దిగ్విజయంగా ముగించారు.

Updated : 16 Oct 2022 05:27 IST

ప్రవాస భారతీయుడు జనార్దన్‌ నిమ్మలపూడి ఘనత

ఈనాడు, అమరావతి: ప్రవాస భారతీయుడు, ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) బోర్డు ఆఫ్‌ డైరెక్టర్‌ జనార్దన్‌ నిమ్మలపూడి(జానీ) 5895 మీటర్ల ఎత్తున్న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి తానా లోగోను ప్రదర్శించారు. మధుమేహం, భుజం ఆర్థరైటిస్‌ సమస్యలతో బాధపడుతూనే 50 ఏళ్ల వయసులో యాత్రను దిగ్విజయంగా ముగించారు. కిలిమంజారో అధిరోహించేందుకు ఆయన రెండేళ్ల పాటు శిక్షణ తీసుకున్నారు. అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో మొత్తం ఏడు రోజుల పాటు యాత్ర సాగింది. క్యాన్సర్‌ మహమ్మారిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రికి నిధుల సేకరణ కోసమే యాత్ర చేపట్టినట్లు జనార్దన్‌ వివరించారు. ఆయన కొన్నేళ్లుగా తారక్‌ ఫౌండేషన్‌ ద్వారా సేవలందిస్తున్నారు. తాను స్వయంగా రూ.10 లక్షలు ఇవ్వడంతోపాటు విరాళంగా సేకరించిన రూ.కోటి డిసెంబరులో నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ఆసుపత్రికి అందిస్తామని చెప్పారు. విరాళాలు అందించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. తనతోపాటు సినీ నిర్మాత రామ్‌ తాళ్లూరితో కూడిన అయిదుగురి బృందం సాహసయాత్రలో పాల్గొందని వివరించారు. రెండేళ్ల కిందట కూడా ఇలాగే బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రికి నిధుల సేకరణ కోసం యాత్ర చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయనను తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరితోపాటు పలువురు అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని