చాపరాల బాబ్జీకి అమెరికా సంయుక్త రాష్ట్రాల జీవిత సాఫల్య పురస్కారం

డాక్టర్‌ చాపరాల బాబ్జీ (ఏలూరు)ని అమెరికా సంయుక్త రాష్ట్రాల జీవిత సాఫల్య పురస్కారం వరించింది.

Published : 20 Oct 2022 22:32 IST

డల్లాస్‌: డాక్టర్‌ చాపరాల బాబ్జీ (ఏలూరు)ని అమెరికా సంయుక్త రాష్ట్రాల జీవిత సాఫల్య పురస్కారం వరించింది. అక్టోబరు 15న ఈ పురస్కారాన్ని డల్లాస్‌ మేయర్‌ జాన్‌ ఎరిక్సన్‌, పలువురు సెనెటర్లు అమెరికా అధ్యక్షుడి తరఫున బాబ్జీకి ప్రదానం చేశారు. అమెరికా అభివృద్ధి పథంలో పయనించే విధంగా.. వివిధ రంగాల్లో అంకితభావంతో దీర్ఘకాలంగా స్వచ్ఛంద సేవలు అందించే వారికి అమెరికా అధ్యక్షుడు ఈ అవార్డులు ప్రకటిస్తారు. స్వచ్ఛంద సేవలు చేసే భారతీయ సంతతికి చెందిన పారిశ్రామికవేత్త అరుణ్ అగర్వాల్‌ (డల్లాస్‌), వితరణశీలి, వయోధిక అమెరికన్‌ సైనికులకు ఉపాధి నైపుణ్యాలను అందించడంలోనూ, ఐవి లీగ్ విద్యా సంస్థల(కళాశాలల)లో ప్రవేశ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ అందించడంలోనూ సేవలందిస్తున్న డాక్టర్‌ చాపరాల బాబ్జీ ఈ పురస్కారానికి ఎంపికైన భారతీయుడు కావడం విశేషం. ఏలూరులో కొండా పార్వతీ దేవి థియోసాఫికల్‌ హైస్కూల్‌, సీఆర్‌ రెడ్డి కళాశాల పూర్వ విద్యార్థి అయిన బాబ్జీ ..అమెరికాలో రెండు డాక్టరేట్‌లు పొందారు. ఆయన ఈ పురస్కారానికి ఎంపిక కావటం తెలుగు వారికి గర్వకారణమని పలువురు కొనియాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని