వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్ వారి ఆధ్వర్యంలో కార్తికవనభోజనాలు

సింగపూర్‌లోని ఆర్యవైశ్యులందరూ భక్తిశ్రద్దలతో కార్తీక వనభోజనాలను నిర్వహించారు. సింగపూర్‌ సమీపంలో కూర్మ ద్వీపం(కుసు ఐలాండ్) ఇందుకు వేదికైంది.

Published : 30 Oct 2022 17:40 IST

సింగపూర్‌లోని ఆర్యవైశ్యులందరూ భక్తిశ్రద్దలతో కార్తీక వనభోజనాలను నిర్వహించారు. సింగపూర్‌ సమీపంలో కూర్మ ద్వీపం(కుసు ఐలాండ్) ఇందుకు వేదికైంది. సముద్రం నుంచి సేకరించిన ఇసుకతో విజయలక్ష్మి, ముక్క ఇంద్రయ్య కుటుంబం, అంజలి, చైతన్యలు కలిసి ఒక సైకత లింగాన్ని ఏర్పాటు చేశారు. శ్రీ మారియమ్మన్ ఆలయం నుంచి తెచ్చిన అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా క్లబ్ సెక్రటరీ నరేంద్రకుమార్ నారంశెట్టి ప్రసంగిస్తూ కార్తీకమాస వైభవాన్ని, శివుని రూపాలు, విశిష్టతను సభ్యులకు వివరించారు.  అందరు కలిసి సామూహిక కార్తీక దీప సమర్పణ చేశారు. కార్యక్రమంలో చిరంజీవి మౌల్య కిషోర్ నాట్య ప్రదర్శన అందరిని ఆకట్టుకొంది. అమృత వాణి, మానస నృత్య ప్రదర్శన అలరించింది. వినయ్, శిల్ప మకేష్, దివ్య మంజుల, స్వప్న మంచికంటి, నీమ ఆనంద్, శ్రావణి, హైందవి లు 80 కి పైగా కుటుంబాలతో 250 మంది సభ్యులని  సమన్వయం చేసుకొంటూ షడ్రసోపేతమైన విందుభోజనాలు సభ్యులందరికి అందించారు.

విఘ్నేశ్వర్‌ రావు, మానసల సహకారంతో  ఫ్యాషన్ వాక్ కార్యక్రమం అందరిని ఆనందింపచేసింది. శశిధర్, విశ్వేశ్వర్, దత్తలు సభాప్రాంగణాన్ని అలంకరించగా, పిల్లలకి, మహిళలకి ప్రత్యేక ఆట పాటల కార్యక్రమం జరిగింది. యాదా నరేష్, శ్రావణి ఆధ్వర్యంలో సాగిన ప్రత్యేక అభినయం పూర్తయిన తర్వాత విజేతలకు ప్రత్యేక బహుమతులు అందించారు.

క్లబ్ సహా వ్యవస్థాపకుడు మంచికంటి శ్రీధర్‌ మాట్లాడుతూ కమిటీ గత పది సంవత్సరాల్లో ఎంతో వైభవాన్ని సంతరించుకొన్నదని కొనియాడారు. మరికొంత మంది సీనియర్ సభ్యులైన విజయ్ వల్లంకొండ, భాస్కర్ గుప్త, ప్రసాద్ బచ్చు, దివ్య గాజులపల్లి, గోపి కిషోర్, సతీష్ కోట మొదలగు వ్యక్తులు వారి విలువైన అనుభూతులను, క్లబ్ కార్యక్రమాలను కొనియాడారు.

కార్యక్రమం విజయవంతమయ్యేందుకు కృషి చేసిన సేవాదళ్ సభ్యుల్లో ముఖ్యంగా శివ కిషన్, ఫణీష్, వినయ్ చంద్, శ్రీనివాస్ అమర, సతీష్ ఉద్దగిరి, హైందవి, కొత్త హరింద్రబాబు, అనిల్ గాజులపల్లి, మణికంఠ, పల్లపోతుల కిషోర్‌, నందన్, మానస్ తదితరులు వారి వారి సహకారాన్నిచ్చి ముందుకు నడిపించారు. కార్యక్రమానికి స్పాన్సర్స్ గా కౌ అండ్ ఫార్మర్, సంపూర్ణ స్వదేశీ, సౌజి డేకర్స్, కామాక్షి జువెల్లర్స్, జి ఆర్ టి జువెల్లర్స్ సహకరించారు.

చివరిగా కార్యక్రమం ముగింపు సభలో కిషోర్ శెట్టి పోషించిన కీలక పాత్రను క్లబ్ సెక్రటరీ నరేంద్ర కుమార్ నారంశెట్టి, సీనియర్ కమిటీ సభ్యుడు ముక్కాకిషోర్ అభినందించారు. గత తొమ్మిది సంవత్సరాలుగా నరేంద్ర సేవలను గుర్తిస్తూ సీనియర్ సభ్యులందరూ దంపతులకు ప్రత్యేక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నరేంద్ర మాట్లాడుతూ సింగపూర్‌లో కోవిడ్ పరిస్థితుల తర్వాత 250 మంది సభ్యులతో కూడిన  కార్యక్రమం కుసు ద్వీపంలో జరగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని