New York: ఉగ్రవాదం నశించాలంటూ పాకిస్థాన్ కాన్సులేట్ వద్ద ఇండియన్ అమెరికన్ల నిరసనలు

ముంబయిలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమానికి 14 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ ఉదంతం ప్రపంచ ఉగ్రవాద దాడుల్లోనే అత్యంత ఘోరమైన ఘటనగా చరిత్రలో నిలిచిపోయింది.

Updated : 27 Nov 2022 13:31 IST

న్యూయార్క్: ముంబయిలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమానికి 14 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ ఉదంతం ప్రపంచ ఉగ్రవాద దాడుల్లోనే అత్యంత ఘోరమైన ఘటనగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ సందర్బంగా అమెరికాలోని ఐదు ప్రధాన రాష్ట్రాల్లో ‘#NeverForget 26/11’ సందేశాలను చూపుతూ ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ, సౌత్ ఆసియన్ డైసుపోర ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. 

న్యూయార్క్‌లోని పాకిస్థాన్ కాన్సులేట్ వద్ద నిరసన కార్యక్రమాలు చేశారు. పాకిస్థాన్‌ పెంచి పోషిస్తోన్న ఉగ్రవాదం నశించాలంటూ.. వందేమాతరం నినాదాలు చేశారు. పాక్‌పై ఒత్తిడి పెంచితేనే ఉగ్రవాదాన్ని నిర్ములిస్తుందని ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ నాయకులు అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మరణాహోమాన్ని సృష్టిస్తోన్న పాక్‌ ఉగ్రవాదులను ఉక్కుపాదంతో అణచివేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ముంబయి తాజ్ హోటల్‌లో జరిగిన ఉగ్ర మరణాహోమాన్ని స్క్రీన్‌పై ప్రదర్శించారు. నవంబర్ 26, 2008 న జరిగిన ఈ దాడుల్లో ఆరుగురు అమెరికన్లు సహా మొత్తం 166 మంది మరణించారు, వేల సంఖ్యలో ప్రజలు గాయపడిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని