అనాథ చిన్నారులకు ప్రవాసాంధ్రుల సహకారంతో చేయూత

తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ఇద్దరు చిన్నారులకు  పురుషోత్తం.. ప్రవాసాంధ్రుల సహకారంతో ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేశారు. 

Published : 07 Dec 2022 22:22 IST

కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా శెట్టూరు మండలంలోని బసంపల్లి గ్రామానికి చెందిన పాలబండ్ల మధుసూదన్‌, పద్మక్కలు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో వారి ఇద్దరు కుమార్తెలు అనాథలుగా మారారు. ప్రస్తుతం వారి పెదనాన్న శ్యామ్‌సుందర్‌ సంరక్షణలో ఉన్నారు. విషయం తెలుసుకున్న పురుషోత్తం ప్రవాసాంధ్రుల సహకారంతో చిన్నారులు పాటిబండ్ల అశ్విని, లక్ష్మిలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేశారు. రూ.10వేల విలువైన దుస్తులు అందజేశారు. భవిష్యత్‌లో కూడా వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు. ఆర్థిక సాయం అందజేసిన వారిలో జ్ఞానభారతి విద్యాసంస్థల అధినేత రమేశ్‌బాబు, కొండయ్య, అచ్చంపల్లి రమేశ్‌, కొల్లి వెంకటేశ్‌ చౌదరి, వెంకట్‌(అమెరికా), కమ్మసంఘం నాయకులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని